Wednesday, March 22, 2023

అలా వచ్చి.. ఇలా..వెళుతున్నాయి..

- Advertisement -

police

* యథేచ్ఛగా సబ్సిడీ గొర్రెల రీసైక్లింగ్
* దళారుల దందాతో అధికారుల పరేషాన్
* రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో
కొనసాగుతున్న తంతు

మన తెలంగాణ/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి  :  గొల్ల, కుర్మలను ఆర్థికంగా ప్రగతి బాటలో ముందుకు తీసుకుపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ ప్రారంభించగా దళారులకు, కొంత మంది అధికారులకు మాత్రం కాసులు కురిపిస్తుంది. గొర్రెల పంపిణీ పథకంలో ప్రభు త్వం నిర్థేశించిన లక్షం చేరాలన్న తాపత్రయంతో అధికారులు పంపిణి చేసిన గొర్రెల గురించి పెద్దగా పట్టించుకోకపోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 368 సంఘాలలో 42 వేల మంది సభ్యులు ఉండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 21 వేల మందికి గొర్రెల పంపిణీ చేయడానికి లాటరీ ద్వారా లబ్ధ్థిదారులను అధికారులు ఎంపిక చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 4687 మంది లబ్ధ్దిదారులకు గొర్రెలను పంపిణీ చేసినట్లు అధికారుల రీకార్డులు తెలుపుతున్న ప్రస్తుతం ఎంత మంది వద్ద గొర్రెలు ఉన్న విషయంపై మాత్రం స్ఫష్టత కరువైంది. వికారాబాద్ జిల్లాలో22025 యూనిట్‌లను పంపిణి చేయడం లక్షంగా పెట్టుకున్నారు. మొదటి విడతలో 10954 యూనిట్‌లకు గాను  ఇప్పటివరకు 4500 యూనిట్ వరకు పంపిణీ చేశారు. యూనిట్‌లను పంపిణీ చేసి చేతులు దులుపుకోవడం తప్ప లబ్దిదారులు వాటిని సంరక్షిస్తున్నారా లేదా అన్న దానిని అధికారులు పూర్తిగా గాలికి వదిలేశారు.మంద ఇచ్చిన …వారం రోజుల్లోనే ప్రభుత్వం గొల్ల, కుర్మలకు కోసం ప్రవేశపెట్టిన పథకంలో దళారుల రంగ ప్రవేశంతో ప్రభుత్వ ఆశయం నెరవెరడం లేదు. ఒక్కో యూనిట్‌కు 30 వేలు రైతు వాటాగా చెల్లిస్తుండగా ప్రభుత్వం నుంచి 80 వేలు అందచేస్తుంది. రైతులకు ప్రభుత్వం చ్చిన యూనిట్ కనీసం ఎడాదైన ఖచ్చితంగా రైతుల వద్ద ఉంటే పునరుత్పత్తి ద్వారా మందలలో వేల సంఖ్యలో గొర్రెలు వచ్చి ఆర్థీకంగా బలపడే అవకాశం ఉంది. కాని రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో కొంత మంది దళారులకు అధికారుల పరోక్ష సహయ సహకారాలు  ఉండటంతో అధికారులు పంపిణి చేసిన గొర్రెలు వారం, పది రోజుల్లోనే తిరిగి కర్నాటక సంతలో కనిపిస్తున్నట్లు తెలిసింది. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు ప్రభుత్వం పంపిణి చేసిన గొర్రెలలో దాదాపు వందకు పైగా యూనిట్‌లు మాయం అయినట్లు అధికారులకు పిర్యాదులు సైతం వచ్చినట్లు తెలిసింది. జిల్లాలోని షాద్‌నగర్, కల్వకుర్తి, ఇబ్రహింపట్నం, చెవెళ్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో గొర్రెల యూనిట్‌లు కనిపించడం లేదన్న చర్చ సాగుతుంది.

వికారాబాద్ జిల్లాలో పరిగి, బషిరాబాద్, దోమ, కుల్కచర్ల తదితర మండలాలలో పెద్ద మొత్తంలో దళారులు రంగ ప్రవేశం చేసి పంపిణి చేసిన వారం రోజులకే రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి తీసుకుపోతున్నారు. అధికారులు కొంత మందికి  కర్నాటకలో గొర్రెలను అందచేసి ఇంటికి తీసుకుపోమ్మంటే వాటిని అక్కడే విక్రయించి వస్తున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతుంది. పరిగి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఇలాంటి సంఘటనలు జరిగినట్లు తెలిసింది. లబ్దిదారులకు పంపిణి చేసిన గొర్రెలను దళారులు గొర్రెల చెవులకు వేసిన ట్యాగ్‌లను కట్ చేసి కొనుగోలు చేసి బజారుకు తరలిస్తున్నారు. కర్నాటక గొర్రెలకు స్థానిక వాతావరణ పరిస్థీతులకు అనుకూలంగా లేకపోవడంతో పలు పర్యాయాలు ఇక్కడకు వచ్చిన వెంటనే ఒకటి రెండు మరణించడంతో లబ్దిదారులు ఆందోళన చెంది దళారులకు విక్రయిస్తున్నారు. గొర్రెల యూనిట్‌లను స్థానిక ఎంపిడిఓలు స్వయంగా పర్యవేక్షించాలని కలెక్టర్‌లు చేసిన ఆదేశాలు కాగితాల్లోనే కనిపిస్తున్నాయి తప్ప క్షేత్రస్థాయిలో మాత్రం అచరణకు నోచుకోవడం లేదు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో ఇప్పటివరకు పంపిణి చేసిన ప్రతి యూనిట్‌ను జిల్లా అధికారులు,మండల అధికారులు కాని పరిశీలిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయి. దళారులకు కొంత మంది పశు వైద్య శాఖ అధికారుల సహకారం ఉండటం వలనే గొర్రెల రిసైక్లింగ్ యదేచ్చగా సాగుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఎంతో మంది ఆశయంతో పెట్టిన పథకంను పక్కగా అమలు చేయడానికి అధికారులు కృషిచేయడంతో పాటు గొల్ల, కుర్మలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News