Home అంతర్జాతీయ వార్తలు కమెడియన్‌ మంజునాథ్‌ నాయుడు కన్నుమూత

కమెడియన్‌ మంజునాథ్‌ నాయుడు కన్నుమూత

Manjunath Naiduదుబాయ్‌ : భారత సంతతికి చెందిన స్టాండప్‌ కమెడియన్‌ మంజునాథ్‌ నాయుడు (36) దుబాయ్‌లో గుండెపోటుతో కన్నుమూశారు. ప్రదర్శన ఇస్తుండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో వేదికపైనే కుప్పకూలారు. ప్రేక్షకులు మాత్రం షోలో భాగంగానే మంజునాథ్‌ పడిపోయారని అనుకున్నారు. అయితే  ఎంతకీ మంజునాథ్‌ లేవకపోవడంతో షో నిర్వాహకులు వైద్యులను పిలిపించి పరీక్షలు చేయించారు.  అప్పటికే మంజునాథ్‌ మృతిచెందినట్లు వైద్యలు నిర్థారించారు. మంజునాథ్‌ అబుదాబిలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు భారత్‌కు చెందినవారు కావడం గమనార్హం. తల్లిదండ్రులు చనిపోవడంతో తన తమ్ముడితో కలిసి మంజునాథ్‌ దుబాయ్‌కు వెళ్లిపోయారు. స్టాండప్‌ కమెడియన్‌గా ప్రదర్శనలు ఇస్తూ జీవిస్తున్నారు. మంజునాథ్‌ మృతిపై పలువురు బాలీవుడ్ నటీనటులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.

Comedian Manjunath Naidu Passed Away