*సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి
మనతెలంగాణ/జనగామ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో 2019లో జరిగే ఎన్నికల్లో టిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజేపి పార్టీలకు ప్రత్యాహ్నమయంగా కమ్యూనిస్టులు సామాజిక శక్తులే (బహుజన లెఫ్ట్ ఫ్రంట్) రాజ్యాధికారంలోకి వస్తే రాష్ట్రంలో సామాజిక న్యాయం -సమగ్రాభివృద్ధి సాద్యమవుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నా రు. గురువారం సిపిఎం పార్టీ కార్యాలయంలో పార్టీ ఏర్పాటు చేసిన సిపియం నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 4 నుండి 7 వరకు నల్లగొండ పట్టణంలో జరిగే సిపిఎం పార్టీ రాష్ట్ర ద్వితీయ మహాసభ వాల్‌పోస్టర్లు ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలపై ప్రజల పక్షాన సమరశీల పోరాటాలు నిర్వహించిన ఘనత సిపిఎం పార్టీదేనన్నారు. ఎన్నికల ముందు టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు 4 సంవత్సరాలు గడిచినా ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది 5 నెలలకుపైగా సామాజిక న్యాయం- సమగ్రాభివృద్ధి లక్షంగా మహజన పాదయాత్ర నిర్వహించి ప్రజా సమస్యలను తెలుసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో వామపక్షాలను ఐక్యం చేస్తూ సామాజిక శక్తులను కలుపుకొని ఉద్యమాలు నిర్వహించిందన్నారు. కెసిఆర్ నిరంకుశ పాలనను అంతమొందించి తెలంగాణలో కష్టజీవులు బహుజనుల రాజ్యం తీసుకెళ్లేందుకు సిపిఎం రాష్ట్ర మహాసభలో చర్చించడం జరుగుతుందని తెలిపారు. పిబ్రవరి 4 నుండి 7 వరకు జరిగే సిపిఎం రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎంం జిల్లా నాయకులు రాపర్తి రాజ, బుడిద గోపి, రమావత్ మిట్యానాయక్, బొట్ల శేఖర్, పి ఉపెందర్, బొడ నరేందర్, బి చందు నాయక్, బాలయ్య, బి వెంకట్, తాండ్ర ఆనందం తదితరులు పాల్గొన్నారు.