Home తాజా వార్తలు రైతుల కోరిన విధంగా పరిహారం

రైతుల కోరిన విధంగా పరిహారం

kcrహైదరాబాద్ : మలన్నసాగర్ ప్రాజెక్టు భూ సమీకరణ విషయంలో రైతులు కోరిన విధంగా పరిహారం ఇవ్వాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. శనివారం సిఎం కెసిఆర్‌ను ఆయన నివాసంలో రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు కలిశారు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు పునరావాసంపై ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు. రైతులకు పరిహారం ఏ పద్ధతిలో కావాలంటే, ఆ మేరకే అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. 2013 భూసేకరణ చట్టం లేదా జీవో 123 కింద ఎలా కోరితే అలా పరిహారం చెల్లిస్తామని ఆయన తెలిపారు.