Home మంచిర్యాల పరిహారం… పరిహాసం…

పరిహారం… పరిహాసం…

river

*గొల్లవాగు నిర్వాసితులకు
అందని పరిహారం
*పన్నెండు సంవత్సరాలుగా అందని డబ్బులు
*సర్వం త్యాగం చేసి న్యాయం కోసం ఎదురు చూపులు
*పూర్తి స్థాయి పరిహారం చెల్లించడంలో అధికారుల అలసత్వం

మనతెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి

ప్రాజెక్టు నిర్మాణ కోసం వ్యవసాయ భూములను రబోసి సర్వస్వం కోల్పోయి, పరిహారం కోసం ఎదురు చూస్తుండగా అధికారులు ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు. గత 12 సంవత్సరాలుగా పూర్తి స్థాయి నష్టపరిహారం అం దక నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నోసార్లు మంత్రులకు విజ్ఞప్తులు చేసినప్పటికీ పట్టించుకోకపోవడం తో నిర్వాసితులు ఉన్న భూములను అమ్ముకొని ఉపాధిని కోల్పోయి దుర్భర జీవితాలను వెళ్లదీస్తున్నారు. ఎన్నోసార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తరువాత సిఎం కేసిఆర్ జైపూర్ పవర్‌ప్లాంట్‌ను సం దర్శించిన సమయంలో నిర్వాసితులు మెమోరాండం సమర్పించినప్పటికీ పరిహారం ఊసే లేకుండా పోయిం ది. భీమారం మండలంలోని పోతనపల్లి గ్రామంలో రూ. 83.61 కోట్ల అంచనాతో 2005లో అప్పటి ఆంధ్రా ము ఖ్యంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గొల్లవాగు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. నిర్మాణ పను లు 2010లో పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు భూముల కు పరిహారం అందడం లేద ని నిర్వాసితులు వాపోతున్నా రు. ప్రాజెక్టును జాతికి అంకి తం చేసిన సమయంలో ని ర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి, వ్యవసాయ  భూములను తీసుకొని అన్యాయం చేశారని నిర్వాసితులు  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం పోతనపల్లి, అరికెపల్లి, భీమారం శివారులో దాదాపు 500 ఎకరాలను ప్రాజెక్టు కోసం సేకరించారు. ప్రభుత్వ, పట్టా భూములను కోల్పోయిన రైతులకు అప్పట్లో పరిహారం కింద రూ. లక్ష మాత్రమే చెల్లించారు. ప్రభుత్వ అసైన్డ్ భూముల మాదిరిగానే పట్టా భూములకు సైతం లక్ష రూపాయలు మాత్రమే చెల్లించి అన్యాయం చేశారని వాపోయారు. మేజర్ సన్స్ కింద పరిహారం ఇస్తామని చెప్పిన అధికారులు తమ వారసులకు పూర్తి స్థాయి పరిహారం అందించలేదని, మరో 20 మంది లబ్ధిదారులు పరిహారం కోసం ఎ దురు చూస్తున్నారు.
పునరావాసం అంతంత మాత్రమే …..
గొల్లవాగు ప్రాజెక్టు కింద పోతనపల్లి గ్రామస్థులకు పునరావాసం అంతంతమాత్రమంగానే కల్పించారు. దాదాపు 80 ఇండ్ల నిర్మాణంతో కాలనీ ఏర్పాటు చేసినప్పటికీ అంతర్గత మంచినీటి పైపులు పగిలిపోయి తాగునీరు అందడం లేదని వాపోతున్నారు. 80 ఇండ్లకు ఒకటే ట్రాన్స్‌ఫార్మర్ ఉ ండడంతో విద్యుత్ సక్రమంగా ఉండడం లేదని వాపోతున్నారు. ఇక మురికి కాల్వల విషయంలో ఏళ్ల తరబడి పూడిక పనులు చేపట్టకపోవడంతో నిండిపోయి కనిపిస్తున్నాయి. పునరావాస కాలనీలో దేవాలయం , కమ్యూనిటీ భవనం నిర్మిస్తామని అధికారులు స్థలం కేటాయించినప్పటికీ ఇప్పటి వరకు వరకు నిర్మాణ పనులు ప్రారంభించలేదు. ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి పూర్తి స్థాయి నష్టపరిహారం అందకపోవడంతో ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్ కార్యాలయాల చుట్టు ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితులు పేర్కొన్నాయి. కాగా పోతనపల్లి గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా గుర్తించాలని ప్రాజెక్టులో చేపలు పెంచుకునే హక్కు కల్పించాలని, నష్టపరిహారం అందిరికి పూర్తి స్థాయిలో అందించాలని నిర్వాసితులు కోరుతున్నారు. ఈవిషయమై జిల్లా కలెక్టర్ ఆర్వీకర్ణన్‌ను వివరణ కోరగా పరిహారం అందించే విషయంలో విచారణ జరిపిస్తామని, ఇప్పటికే కొందరికి అందించామన్నారు. ఒక వేళ పరిహారం అందని వారు ఉన్నట్లయితే విచారణ జరిపి పరిహారం చెల్లిస్తామని ఆయన తెలిపారు.