Home ఖమ్మం నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు

నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు

Govt-Hospitalనిర్లక్ష్యానికి కేరాఫ్ అడ్రస్‌గా ఖమ్మం జిల్లా ప్రభుత్వ వైద్యశాల
క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కరువు వేధిస్తున్న వైద్యులు, సిబ్బంది కొరత ఒకే బెడ్డుపై ఇద్దరు, ముగ్గురు
ఆసుపత్రికి రావాలంటే రోగుల్లో భయం…

మన తెలంగాణ/ఖమ్మం: ఖమ్మం జిల్లాకు హెడ్ క్వార్టర్‌గా ఉన్న ప్రధాన ప్రభుత్వాసుపత్రిలో రోగులు వైద్య చికిత్స నిమిత్తం చేరితే నరకం అను భవించాల్సిందే. రెండు, మూడు దశా బ్ద్దాల కాలం నుంచి సర్కార్ దావాఖానా వైద్య సేవలు అంది స్తున్నారు. దవా ఖానాకు కోట్లాది రూపాయల నిధులు మంజూరవుతున్నా ఆ నిధులు క్షేత్ర స్థాయిలో చేరకుండానే కాంట్రాట్టార్లకు వరంగా మారుతున్నాయి. జిల్లా ప్రధా న ఆసుపత్రిలో అనేక శాఖలలో వైద్యు లు, సిబ్బంది కొరత అడుగడుగునా వెక్కిరిస్తుంది. అనేక విభాగాల్లో ఉండా ల్సిన సిబ్బంది కన్న తక్కువ సిబ్బంది ఉండడంతో ఉన్న కొద్దిపాటి సిబ్బందిపై  పనిభారం పెరగడంతో రోగులకు సకాలంలో  వైద్యం అందించలేని పరిస్థితి. ఇటీవల నెల రోజులుగా జిల్లాల్లో వ్యాపిస్తున్న  డెంగీ, మలేరియా రోగాలతో ప్రధాన ఆసుపత్రికి భద్రాచలం, ఖమ్మం జిల్లాల వేలాది మంది రోగులు ఇక్కడకు వస్తున్నారు. వచ్చిన రోగులకు వైద్యం అందించడం ఉన్న సిబ్బం దికి కత్తిమీద సాములా మారింది. ఇటీవల సర్కార్ ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చిన ఓ మహిళకు డెలివరి సమయంలో సంబంధిత వైద్యుడు లేకపోవడంతో శిశువు మృతి చెందిన సంఘటన సంచలనం సృష్టించింది. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు అయితం సత్యం ఆధ్వర్యంలో ప్రధాన ఆసుపత్రిని పరిశీలించి వసతులపై పెదవి విరిచారు. వైద్యుల పనితనంలో మార్పు రాకపోవడంతో పాటు వచ్చిన రోగులకు వైద్యం అందిం చడంలో నిర్లక్షం చేస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపి స్తున్నాయి.

ప్రధాన ఆసుపత్రుల్లో అత్యవసర సమయాల్లోనూ ఒక బెడ్ పై ఇద్దరు, ముగ్గుర్నీ ఉంచి వైద్యం చేయడంతో పాటు బెడ్లు లేక నేలపై పడుకొబెట్టి వైద్యం చేస్తున్న సంఘటనలు కొకోల్లలు జరుగుతున్నాయి.   ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే వైద్యులకు 70 శాతానికి పైగా ఏదో ఒక బినామీ పేర్లతో సొంత ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు.  మరో పక్క ప్రసూతి వైద్య నిపుణులు, మత్తు మందు వైద్యులు పై అధికారులు మందలిస్తే సెలవుల పేరుతో డుమ్మా కొట్టడం వీరికి పరిపాటిగా మారింది. గర్భిణులకు  ప్రధాన ఆసుపత్రిలో పలు సూచనలు చేయాల్సిన వైద్యులు లేకపోవడం గమనార్హం. గర్భిణిల వివరాల సేకరణ, వివరాల నమోదు, రక్తహీనత, రక్తపోటు తదితర తీవ్ర సమస్యలు ఉన్నాయా అనే అంశాలపై పరిశీలన, తీవ్ర సమస్యలు ఉంటే పెద్ద ఆసుపత్రిలో వివరాలు నమోదు. ముందస్తు పడకల కేటాయింపు గర్భిణి, వైద్యులు కాల్ సెంటర్‌ను అప్రమత్తం చేయడం, నిర్ధేషిత తేదీకి కాన్పు చేయడం, శిశువు పూర్తి సమాచారం పొందు పర్చడం, సేవలపై బాలింత, బంధువుల నుంచి అభిప్రాయ సేక రణ, పుట్టిన బిడ్డకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేయడం తదితర ప్రణాళికతో నిత్యం అందుబాటులో ఉండాల్సిన ఆ సిబ్బంది మొక్కుబడిగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగులకు ఇక్కడ వసతులు తక్కువని వేరే ప్రైవే టు ఆసుపత్రుల్లో వైద్యం చేయిం చుకోవాలని  సిబ్బంది సూ చించడం గమన్హారం.  ఇప్పటిఐనా జిల్లా మంత్రి స్పందించి ప్రధా న ఆసుపత్రిలో పడకల సంఖ్య పెంచడంతో పాటు వైద్యులను పెంచడం, మౌలిక వసతులు కల్పిస్తే రోగులకు మెరుగైన వైద్యం అందుతుంది.