Thursday, April 25, 2024

బెల్లంపల్లి సిఐపై హెచ్‌ఆర్‌సిలో ఫిర్యాదు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పోలీస్టేషన్‌కు వెళ్లిన కుటుంబం పట్ల అమానుషంగా వ్యవహరించిన బెల్లంపల్లి ఇన్స్పెక్టర్ రాజు తీరుపై బాలల హక్కుల సంఘం బుధవారం హెచ్‌ఆర్‌సిలో ఫిర్యాదు చేసింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఓ పార్టీ నేత తమను బెదిరిస్తున్నాడని, ఆయన నుంచి రక్షణ కల్పించాలని వెళ్లిన కుటుంబంపై సిఐ రాజు దౌర్జన్యపూరితంగా వ్యవహరించాడని ఆ కుటుంబం ఆరోపిస్తూ ఫిర్యాదు చేసింది. సదరు బాధితుల సమస్యను ఇన్సెక్టర్ రాజు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఆ కుటుంబం నిరసనకు దిగింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెల్లంపల్లి ఇన్స్పెక్టర్ రాజు తన సిబ్బందితో ఇద్దరు మైనన్ బాలలు అరవింద్, సందీప్‌లను బూటు కాళ్లతో తన్నుతూ పోలీస్ వ్యాన్ ఎక్కించాడని, చట్టాన్ని అతిక్రమించిన సిఐ రాజుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్‌పి, కలెక్టర్లను ఆదేశించాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు మానవ హక్కుల కమీషన్‌లో ఫిర్యాదు చేశారు. సిఐ రాజును వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేసి విచారణ చేపట్టాలని బాలల హక్కుల సంఘం తరపున ఆయన హెచ్‌ఆర్‌సిలో ఫిర్యాదు చేశారు.

Complaint to HRC Against Bellampalli CI

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News