Home వార్తలు సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే విటమిన్లు

సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే విటమిన్లు

mineralsచర్మానికి నునుపు, మెరుపుతో పాటు నిత్యం చురుకుదనాన్ని ఇచ్చే ఆరోగ్యం కోరుకుంటే వచ్చేసేదికాదు. దానికోసం కనీస శ్రద్ధయినా పెట్టి తీరాలి. ముఖ్యంగా వేపుళ్లు, నూనె ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను వీలైనంత తక్కువగా తీసుకోవాలి. శరీరానికి అవసరమైన అతి ముఖ్యమైన విటమిన్లు అందుతున్నాయో లేదో ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి. అలా చేయాలంటే ముందు మీకు ఏయే విటమిన్ ఎక్కడ లభిస్తుందో తెలియాలి కదా! అలాంటి వివరాలు మీకోసం…
విటమిన్ -సి… ఈ విటమిన్ మీరు కావాలనుకుంటే బాగా ముదురు పచ్చరంగులో ఉన్న ఆకుకూరలు, కూరగాయలను ఆశ్రయించాల్సిందే. అంతేకాదు నిమ్మజాతి ఫలాలు, అరటిపళ్ళు, స్ట్రా బెర్రీస్ వంటి పళ్లలో కూడా లభిస్తుంది.
విటమిన్-ఇ … గింజధాన్యాలు, గోదుమ అన్నం, వెజిటెబుల్ ఆయిల్ గోధుమ పిండితో చేసిన వంటకాలు తీసుకుంటే విటమిన్-ఇ సరిపడా అందుతుంది. ఆరోగ్యాన్ని ఇస్తుంది.
విటమిన్-బి… పప్పుదినుసులు, మాంసాహారంలో ముఖ్యంగా లివర్‌లలో విటమిన్-బి సరిపడినంతగా ఉంటుంది.
విటమిన్-ఎ… సార్డియన్స్, టునా, మకెరిల్ ఫిష్ లివర్, ఆయిల్‌ఫిష్ వంటి ఆహారం విటమిన్ ఎ ను ఎక్కువగా అందిస్తుంది. వీటన్నింటితోపాటు మీరు రోజులో తీసుకునే మంచి నీరుమీద ఫలితం ఆధారపడి ఉంటుంది. పై విటమిన్‌లను అందించే ఆహారాలన్నీ సక్రమంగా తీసుకున్నా సరే రోజుకు కనీసం 8 నుంచి 12 గ్లాసులు నీరు తాగాలి. దానితో పాటు టీ, కాఫీలను రోజులో విపరీతంగా తాగకుండా ఒక పరిమితి పాటించాలి. అలాగే ఎక్కువగా కూల్‌డ్రింక్స్ తాగకుండా రోజులో కనీస వ్యాయామం క్రమం తప్పకుండా చేస్తే తప్పనిసరిగా మీరు కోరుకుంటున్న మెరుపు మీ చర్మానికి, సంపూర్ణ ఆరోగ్యం మీకు సొంతం.