Wednesday, March 29, 2023

రెండేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి

- Advertisement -

meeting

*8 లిప్టులతో నీటి విడుదలకు ఏర్పాట్లు
చీప్‌విఫ్ కొప్పుల ఈశ్వర్

మనతెలంగాణ / ధర్మపురి : నీటి  కష్టాలు తొలగించేందుకు కాలేశ్వరం ప్రాజెక్టు రెండేండ్ల కాలంలో పూర్తవుతుందని చీప్‌విఫ్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. మనఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా మండలంలోని దోనూర్ గ్రామంలో నిద్రించిన చీప్‌విఫ్ కొప్పుల ఈశ్వర్ మంగళవారం ఉదయం గ్రామంలోని వాడ వాడను తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పరిష్కార మార్గాలను అన్వేషించారు. గిరిజన గూడెంలోని ప్రజలను కలిసి సమస్యలు తెలుసుకున్నారు. పశువుల తాగు నీటి కోసం చెక్‌డ్యాం ఏర్పాటు, పాఠశాల రిజిస్ట్రేషన్, అదనపు తరగతి గదుల నిర్మాణం, పిఎసిఎస్ గోదాం నిర్మాణం, 21 గొర్రెల షెడ్ల ఏర్పాటు, కాలువ లైనింగ్ పనులకు మంజూరు, కుల సంఘ భవనాలకు నిధులు మంజూరు విషయాలు చీప్‌విఫ్ కొప్పుల ఈశ్వర్ దృష్టికి తీసుకొచ్చారు. దోనూరు శివారులోని గుట్టకు వర్షకాలంలో మనుషులు, పశువులు వెళ్లాలంటే చాలా ఇబ్బంది కరంగా ఉంటుందని, వాగుపై వంతెన నిర్మిస్తే సౌకర్యంగా ఉంటుందని చీప్‌విఫ్  ఈశ్వర్‌కు ప్రజలు విన్నవించుకున్నారు. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు సమస్యలతో పాటు, అర్హులకు పెన్షన్ రావడం లేదని మరి కొందరు చీప్‌విఫ్ ముందు వాపోయారు. గ్రామంలోని పాఠశాల స్థలం ఇంత వరకు రిజిస్ట్రేషన్ కాలేదని, దానితో ప్రహరిగోడ తదితర అభివృద్ధి పనులకు మంజూరు కావడం లేదని గ్రామస్థులు అన్నారు. డబుల్ బెడ్‌రూం పనులను పరిశీలించారు. అనంతరం వివిద శా ఖల అధికారులతో రివ్యూ సమావేశం ఏర్పా టు చేసి గ్రామంలోని సమస్యలపై చర్చించి, వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. గిరిజన గూడెం గ్రామంలో నిర్మించిన మూడు సిసి రోడ్లు ప్రారంభించి, మరో రెండు రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అదే విధంగా పాఠశాలలో రెండు అదనపు తరగతి గదులు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. గొర్రెల పాకలు ప్రారంభించి, లబ్ధ్దిదారులకు భూమి పట్టాలు పంపిణీ చేశారు. దో నూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశం లో చీప్‌విఫ్ కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం కానుందన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మించాలని ము ఖ్యమంత్రి కెసిఆర్‌కు ఆలోచన రావడం మహా అద్భుతమని చెప్పారు. మేడిగడ్డ వద్ద మే మా సంలో కూడా 27టిఎంసిల నీళ్లు నిలిచి ఉం టాయన్నారు. ప్రాజెక్టులన్ని పూర్తయితే రాబో యే రోజుల్లో రైతును రాజుగా చూడడం కాయమన్నారు. ధర్మపురి ప్రాంతానికి ఎస్సారెస్పీ డి53 కాలువ జీవనాధారమని అన్నారు. ధర్మపురి గోదావరి నది ఒడ్డున గల గ్రామాలకు ఇప్పటికి 8 లిప్టులు ఏర్పాటు చేశామని మరి న్ని లిప్టుల మంజూరుకు కృషి చేస్తానన్నారు. సిఎమ్ కెసిఆర్ ధర్మపురి సమావేశంలో రోళ్లవాగు ఆధనీకరిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. రోళ్లువాగు ఆధునీకరణకు రూ. 62కోట్లు మంజూరు చేశారన్నారు. రోళ్లవాగుతో పాటు, కమలాపూర్ బందం మా టు పూర్తయితే ఈ ప్రాంత రైతుల నీటి కష్టాలు తీరుతాయన్నారు.  ఈ కార్యక్రమంలో ఆర్డీఓ నరెందర్, ఎంపిపి కొండపెల్లి మమత, జడ్పిటిసి బాదినేని రాజమణి రాజేందర్, వైస్ ఎం పిపి అయ్యోరి రాజేష్, దేవస్థాన చైర్మన్ ఎ ల్లాల శ్రీకాంత్‌రెడ్డి, ఎఎమ్‌సి చైర్మన్ అల్లం దేవ మ్మ, మండల రైతు సమన్వయ కమిటి అధ్యక్షులు సౌల్ల భీమన్న, కోఆప్షన్ సబ్యులు స య్యద్ ఆసీఫ్, సర్పంచ్ కొండపెల్లి సువర్ణ, ఎంపిటిసి సబ్యులు చిరుత సత్తవ్వ  టిఆర్‌ఎస్ మండలపార్టి అధ్యక్షులు మల్లేశం, నాయకు లు అనంతుల లక్ష్మన్, లక్కాకుల భగవంతరావు, తదిరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News