*డ్రైనేజీ పనులను తనిఖీ చేసిన మేయర్
*మిషన్ భగీరథ పైప్‌లైన్‌కు శంకుస్థాపన
*నగర మేయర్ సర్దార్ రవీందర్ సింగ్
మనతెలంగాణ/కరీంనగర్‌టౌన్: నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులను నాణ్యతతో పూర్తి చేయాల ని నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ ఆదేశించారు. బుధవారం గీతాభవన్ వద్ద జరుగుతున్న అండర్ డ్రై నేజీ పనులను తనిఖీ చేసి,మిషన్ భగీరథ పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మే యర్ మాట్లాడుతూ పనులను వేగవంతంగా పూర్తి చే యాలని ఆదేశించారు. డ్రైనేజీ నిర్మాణాలలో లేవల్స్ ను పాటించాలన్నారు.. నాణ్యతలో ప్రత్యేక శ్రద్ధ చూ పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇ బ్బందులు కల్గకుండాపైపులు సరిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వాల రమణారావు, ఎడ్ల అశోక్, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రాజ్ కుమార్, అ ధికారులు పాల్గొన్నారు.
ఆకస్మిక తనిఖీలు చేసిన మేయర్
కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో నగర మేయ ర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన నల్లా కనెక్షన్, పె డి ంగ్ బిల్లులు తదితర విషయాలను అధికారులను అ డిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ మా ట్లాడుతే దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచకుండా చర్య లు తీసుకోవాలన్నారు. ప్రజలకు జవాబుదారీతనం గా పనిచేయాలన్నారు. పనులను తర్వితగతిన పూర్తి చేసి ప్రజలకు సహకరించాలన్నారు. అందరి సహకారంతోనే నగరాభివృద్ధి జరుగుతుందన్నారు విధుల పట్ల నిర్లక్షం వహిస్తే చర్యలు తప్పవన్నారు.