Thursday, April 25, 2024

భూపాలపల్లికి ‘నగర శోభ’

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/జయశంకర్‌భూపాలపల్లి జిల్లా ప్రతినిధి : ‘భూపాలపల్లి సమగ్ర పట్టణాభివృద్ధే ఏకైక లక్షం గా పని చేస్తున్నానని ఎంఎల్‌ఎ గండ్ర వెంకటరమణారెడ్డి తెలియజేశారు. భూపాలపల్లి ప్రజల సం క్షేమం, కోసం నిరంతరం కృషి చేస్తున్నానని, గత ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నేరవేర్చానని స్పష్టం చేశారు. అందులో భాగంగానే భూ పాలపల్లికి మెడికల్ కళాశాల, రోడ్డు మంజూరు కావడం, తాగునీటి సమస్య పరిష్కారం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోందని తెలియజేశారు. ఎంఎల్‌ఎ గండ్ర వెంకటరమణరెడ్డితో ‘మన తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వూలో గండ్ర పలు విషయాలను పంచుకున్నారు. ఆ ఇంటర్వూ వివరాలు..

మన భూపాలపల్లి పట్టణాభివృద్ధి కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు?

ఎంఎల్‌ఎ గండ్ర: భూపాలపల్లి నియోజవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నా. ఇందులో ప్రధానంగా పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. సమగ్ర పట్టణాభివృద్ధే ఏకైక లక్షంగా పనిచేస్తున్నా. గతంలో పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండేది. రూ.100 కోట్లతో అన్ని పనులు చేయించి ప్రతి ఇంటికీ తాగునీరు అందేలా అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టాను. పట్టణ పరిధిలో ఎక్కడా కూడా తాగునీటి సమస్య లేకుండా పోయింది. సైడ్ కాలువలు, రోడ్ల నిర్మాణం ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ. 50 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. భూపాలపల్లి టు వయా జంగేడు, రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
సుమారు రూ.80 చెల్పురు టు భూపాలపల్లి నాలుగు లైన్ల రోడ్డు విస్తారణ పనులు జరుగుతున్నాయి. పూర్తయితే చాలావరకు ట్రాఫిక్ సమస్య తగ్గడంతో పాటు, వాహనదారులకు ఎం తో ఉపయోగకరంగా ఉంటుంది. పా టు రూ. 4.5 కోట్లతో సుభాష్ మినీ స్టేడియం కోసం శంకుస్థాపన చేసుకున్నాం. త్వరలో పనులు ప్రా రంభం కానున్నాయి. కోట్లతో అంబేద్కర్ కమ్యూనిటీ హా ల్ నిర్మాణం చేస్తున్నాం. మార్కెట్‌ను నిర్మించుకున్నాం. ఈ నెల 23న మంత్రి కెటిఆర్ పట్టణాభివృద్ధి కోసం రూ.50 కోట్లు ప్రకటించిన వి షయం అందరికీ తెలిసిందే. మిగిలిన సమస్యల పరిష్కారం, కోసం ఈ నిధులను వినియోగిస్తాం.

మన తెలంగాణ: విద్యా, కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు?
గండ్ర : భూపాలపల్లిలో విద్యా, కోసం ప్రత్యేక దృష్టి సారించాం. ప్రధానంగా విద్యా విభాగంలో భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను నిర్మించుకొని తరగతులు కొనసాగుతున్నాయి. రెసిడెన్షియల్ స్కూల్ నుంచి ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ చేశాం. త్వరలో మైనింగ్ కళాశాలను తీసుకురావడం కోసం ప్రయత్నాలు చేస్తున్నా. అలాగే పేద ప్రజల వైద్య సౌకర్యాల కోసం ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు చేతులమీదుగా 100 పడకల ఆస్పత్రిని ప్రారంభించుకున్నాం. సదుపాయాలు, సరిపడా వైద్యులతో పేద ప్రజలకు వైద్య సేవలు అద్భుతుంగా అందుతున్నాయి. నా విజ్ఞప్తి మేరకు సిఎం కెసిఆర్ మెడికల్ కళాశాలను మంజూరు చేశారు. విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. మరోవైపు 100 పడకల ఆసుపత్రిని 250 పడకల ఆస్పత్రిగా ఆప్‌గ్రేడ్ చేపించడంతో మెరగైన భూపాలపల్లి జిల్లా వాసులతో పాటు ఇతర ప్రాంత ప్రజలకు కూడా అందుతాయి. పాటు పట్టణంలో ఇండ్లు లేని నిరుపేదల కోసం కెసిఆర్ నాయకత్వంలో సుమారు 1000 డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించుకొని, మంత్రి కెటిఆర్ చేతులమీదుగా ప్రారంభించుకున్నాం. త్వరలో లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూం ఇండ్లను అందజేస్తాం. ఈ ప్రక్రియ కొనసాగుతొంది.

మన తెలంగాణ: సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతున్నాయా?

గండ్ర : ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారమవుతున్నాయి. 18 శాతం ఉన్న లాభాల వాటాను 30 శాతం పెంచి కార్మికుల లాభాల వాటాను బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో అందిస్తున్నాం.మెడికల్ అన్‌ఫిట్ ద్వారా కార్మికుల వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. స్థానికంగా భూపాలపల్లి ఏరియాలో కూడా సింగరేణి కార్మికుల వసతి గృహాల కోసం 996 డబుల్ బెడ్ రూం క్వార్టర్లను మంత్రి కెటిఆర్ చేతులమీదుగా ప్రారంభించుకన్నాం. కౌన్సెలింగ్ నిర్వహించి సీనియర్టీ ఆధారంగా కార్మికులకు క్వార్టర్లను కేటాయిస్తాం. ప్రధానంగా సుభాష్‌కాలనీ, కాలనీలో సింగరేణి కార్మికులకు గతంలో ఇచ్చిన ఇంటి స్థలాలకు పట్టాలివ్వలేదు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించి సింగరేణి ,రెవెన్యూ అధికారుల సమన్వయం చేయించి జిఒ నెం.76 ప్రకారం ఆ కాలనీలో నివాసం ఉంటున్న వారికి రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. ప్రధాన సమస్య పరిష్కరించడంలో కృషి చేశాను.

మన తెలంగాణ: మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎంతవరకు అమలు చేశారు?
గండ్ర : గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ చాలా వరకు పూర్తి చేశాను.ప్రధానంగా భూపాలపల్లికి మెడికల్ కళాశాల తీసుకొస్తానని చెప్పాను. అప్పుడు కొంతమంది ఇది సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశీస్సులతో మెడికల్ కళాశాల సాధ్యమైంది. దీంతో మెడికల్ కళాశాలకు అనుబంధంగా 100 పడకల ఆసుపత్రిని 250 పడకలకు అప్‌గ్రేడ్ చేయించడం జరిగింది. అలాగే 50 పడకల ఆయుష్ ఆసుపత్రిని కూడా మంజూరు చేయించా. ఆసుపత్రి నిర్మాణ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ప్రధానంగా రూ.85 కోట్లతో బైపాస్ రోడ్డును మంజూరు చేయించాను. బాంబులగడ్డ నుంచి మోరంచపల్లి వరకు బై పాస్ వెళ్తుంది. భూసేకరణ కోసం 29.6 కోట్లు కూడా మంజూరయ్యాయి. పెరుగుతున్న పట్టణ జనాభా, ట్రాఫిక్ సమస్య దృష్టా గత ఎన్నికల్లో హామీ ఇచ్చి అమలు చేశాను.

మన తెలంగాణ: బిఆర్‌ఎస్ జాతీయ రాజకీయ పార్టీగా సక్సెస్ అవుతుందా?
గండ్ర : సిఎం కెసిఆర్ నాయకత్వంలో భారత రాష్ట్ర సమితి తప్పక జాతీయ రాజకీయల్లో విజయవంతమవుతుంది. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఇతర రాష్ట్రాల్లో అమలు చేయాలని, అక్కడి ప్రజల నుంచి డిమాండ్ వస్తుంది. బిఆర్‌ఎస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే మా నాయకులు సిఎం కెసిఆర్ చెప్పినట్టు దేశమంతా రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తారు. ఇతర సంక్షేమ పథకాలను దేశామంతా అమలు చేస్తారు.

మనతెలంగాణ: జిఎంఆర్ ట్రస్ట్ ద్వారా ఎలాం టి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు?

గండ్ర : మా నాన్నగారి పేరు మీద జిఎంఆర్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రధాన లక్షం ప్రభుత్వం ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ అదనంగా మరిన్ని కార్యక్రమాలు చేపట్టడం కోసం ఈ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశాం. ట్రస్ట్ ద్వారా వందల మంది నిరుద్యోగులకు ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉచిత శిక్షణ తరగతులను చేపట్టాం. ప్రీలిమినరీ క్వాలీఫై అయిన వారికి ఫిజికల్ ఈవెంట్స్ కోసం ప్రత్యేక శిక్షణ అందించాం. గ్రూప్స్, టెట్ ఇతర పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ తరగతులను చేపట్టడం జరిగింది. వీటితో పాటు నిరుద్యోగుల కోసం డ్రైవింగ్ శిక్షణ అందజేసి సూమారు 1000 మందికి లైసెన్స్‌లను అందించడం జరిగింది. 100 పడకల ప్రభుత్వాస్పత్రిలో ఉచిత మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రూ.లక్ష ప్రైజ్ మనీతో ఎంఎల్‌ఎ క్రికెట్ కప్‌ను నిర్వహిస్తున్నాం. వీరిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని ఎంపిక చేసి రాష్ట్రస్థాయి పోటీ లో రాణించేందుకు మెరుగైన శిక్షణ అందిస్తున్నాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News