Tuesday, April 16, 2024

రాహుల్‌తో కంప్యూటర్ బాబా అడుగులు

- Advertisement -
- Advertisement -

నగర్ మాల్వా: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్‌లో కొనసాగిస్తున్న భారత్ జోడో యాత్రలో వివాదాస్పద స్వయం ప్రకటిత ఆధ్మాత్మిక గురువు నాందేవ్ దాస్ త్యాగి అలియాస్ కంప్యూటర్ బాబా శనివారం పాల్గొన్నారు. కాగా.. గతంలో భూఆక్రమణ కేసులు అరెస్టయిన ఆ వ్యక్తి రాహుల్ గాంధీతోపాటు పాదయాత్రలో పాల్గొనడానికి ఎలా అనుమతి ఇచ్చారని బిజెపి ప్రశ్నించింది. ఇండోర్ సమీపంలోని తన ఆశ్రమంలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టినందుకు పంచాయతీ అధికారులు కూల్చివేత చేపట్టగా అడ్డుకున్నందుకు 2020లో త్యాగి అరెస్టయ్యారు. శనివారం ఉదయం నగర్ మాల్వా జిల్లాలోని మహుదియా గ్రామంలో రాహుల్‌తోపాటు యాత్రలో త్యాగి పాల్గొన్నారు. రాహుల్‌తో త్యాగి ముచ్చటించడం కనిపించింది.

వారితోపాటు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ కూడా ఉన్నారు. ఇలా ఉండగా.. ఇటీవల కాంగ్రెస్‌ను వీడి బిజెపిలో చేరిన నరేందర సలూజా భారత్ జోడో యాత్రలో త్యాగి పాల్గొనడంపై విమర్శలు గుప్పించారు. కన్హయ కుమార్, సినీ నటి స్వర భాస్కర్ తర్వాత ఇప్పుడు కంప్యూటర్ బాబా వంతని, ఇదేమి జోడో యాత్రని ఆయన వ్యాఖ్యానించారు. కాగా..బిజెపి విమర్శలపై కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి రాజ్‌కుమార్ పటేల్ స్పందిస్తూ భారత్ జోడో యాత్రలో పలువురు సాధువులు, మత పెద్దలు పాల్గొంటున్నారని, దేశ ప్రయోజనాల కోసం యాత్రలో అందరూ ఆహ్వానితులేనని చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News