Home జాతీయ వార్తలు అనుమానాస్పదస్థితిలో కంప్యూటర్‌ ఇంజనీర్‌ మృతి

అనుమానాస్పదస్థితిలో కంప్యూటర్‌ ఇంజనీర్‌ మృతి

Computer Engineer Died In Tamilnaduచెన్నయ్ : తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో ఉన్న ఓ ఫామ్‌హౌస్‌లో కంప్యూటర్‌ ఇంజనీర్‌ అనుమానాస్పదస్థితిలో చనిపోయాడు. హస్తినాపురానికి చెందిన సుదర్శన్‌ (39) అమెరికాలో కంప్యూటర్‌ ఇంజనీర్‌గా పని చేశాడు. కరోనా  కారణంగా గత ఏడాది సుదర్శన్‌  చెన్నయ్ కు తిరిగొచ్చారు. అప్పటి నుంచి ఆయన మహాబలిపురం శివారులోని పట్టిపుల్లమ్‌ ఫామ్‌హౌస్‌లో తన స్నేహితులతో కలిసి ఆన్‌లైన్‌ వ్యాపారం చేస్తున్నాడు. అయితే సోమవారం సుదర్శన్ ఫామ్‌హౌస్‌లోని ఓ గదిలో విగతజీవిగా కనిపించాడు. సుదర్శన్ తలకు గాయమైంది. అయితే సుదర్శన్ మెట్ల మీది నుంచి జారి పడ్డాడా, లేక హత్యకు గురయ్యాడా అనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం కోసం సుదర్శన్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.