Friday, April 19, 2024

పిసిలు తెగ కొనేస్తున్నారు..

- Advertisement -
- Advertisement -

క్యూ2లో కంప్యూటర్ సేల్స్ 11.2% పెరిగాయి
ప్రపంచవ్యాప్తంగా 7.23 కోట్ల పిసిలు విక్రయం: నివేదిక
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోం’ ఇవ్వడంతో పిసిలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. తాజాగా ఐడిసి నివేదిక ప్రకారం, 2020 రెండో త్రైమాసికం(క్యూ2)లో పిసి (పర్సనల్ కంప్యూటర్) ఎగుమతులు ప్రపంచవ్యాప్తంగా 11.2 శాతం పెరిగాయి. కోవిడ్19 కారణంగా ప్రజలు ఇంటి నుండి పని చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారని, ఈ కారణంగా ల్యాప్‌టాప్‌లు, పిసిల డిమాండ్‌కు దారితీసిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
యూరప్, ఆఫ్రికా, అమెరికాలో ఎక్కువ
ఈ కాలంలో ల్యాప్‌టాప్‌లు, వర్క్‌స్టేషన్లు, డెస్క్‌టాప్‌లతో సహా 72.3 మిలియన్ (అంటే 7.23 కోట్ల) యూనిట్లు అమ్ముడయ్యాయని ఐడిసి పేర్కొంది. యూరప్, మిడిల్-ఈస్ట్, ఆఫ్రికా, అమెరికా వంటి దేశాలు అమ్మకాలలో అత్యధిక పెరుగుదలను నమోదు చేశాయి. ఈ ఏడాది చివర్లో మూడో త్రైమాసికంలో భారతదేశ అమ్మకాల గణాంకాలు మెరుగైన సంఖ్యను చూపించే అవకాశం ఉందంటున్నారు.
25% మార్కెట్ వాటా హెచ్‌పిదే..
ఈ విభాగంలో ఏ ప్రముఖ బ్రాండ్లు ఉన్నాయో నివేదికలో వెల్లడించారు. 25 శాతం వాటాతో హెచ్‌పి చార్టులో అగ్రస్థానంలో ఉందని ఐడిసి పేర్కొంది. 24.1 శాతం వాటాతో లెనోవా రెండో స్థానంలో ఉండగా, డెల్ 16.1 శాతం వాటాతో టాప్ 3లో ఉంది. ఈ కాలంలో ఆపిల్ 5.5 మిలియన్ యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. దీనికి 7 శాతం మార్కెట్ వాటా లభించింది. ఎసెర్ 6.7 శాతం మార్కెట్ వాటాతో టాప్ 5లో ఉంది. అయితే రాబోయే సంవత్సరాల్లో మార్కెట్ మార్పులను ఆశించవచ్చు. ఎందుకంటే షియోమి, హానర్‌తో సహా మరికొన్ని బ్రాండ్లు మార్కెట్‌లోకి ప్రవేశించి కీలక మార్పులు తేగలవని అంటున్నారు.
రూ.40,000 లోపు పిసిలపై భారతీయుల ఆసక్తి
మొబైల్‌తో పోలిస్తే పిసిల విషయంలో ఇండియాలో డిమాండ్ ఇతర దేశాల కంటే చాలా తక్కువగా ఉంది. ఈ విభాగంలో కొనుగోలుదారులు రూ.40,000 లోపు పిసిలకే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. కాని కొత్త బ్రాండ్లు, సాంకేతికత చౌకగా మారడంతో ధోరణులలో మార్పు వస్తుందని భావిస్తున్నారు. షియోమి ఇటీవలే దేశంలో మి నోట్‌బుక్‌ను విడుదల చేసింది. ఇతర బ్రాండ్లు కూడా ఇదే ధోరణిని అనుసరిస్తున్నాయి, ఇది కొనుగోలుదారులకు ఎంచుకోవడానికి మరిన్ని ఎంపికలను ఇస్తోంది.

Computer sales in Q2 increased by 11.2%

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News