Friday, April 19, 2024

కంప్యూటర్ సైన్స్‌కే క్రేజ్

- Advertisement -
- Advertisement -

ఇంజినీరింగ్‌లో సిఎస్‌ఇ సీటు వైపే విద్యార్థుల

కన్వీనర్, కోటా ఏదైనా సరే దానికే అధిక డిమాండ్ అనుబంధ బ్రాంచీల్లో సీట్లు పెంచుకుంటున్న కాలేజీలు
మొదటి విడతలో 99.91% సీట్లు కేటాయింపు టాప్-10 కాలేజీల్లో చేరేందుకు ఆసక్తి

మన: ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సర ప్రవేశాల్లో విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌కే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. సిఎస్‌ఇ ఇటీవల కాలంలో అత్యంత క్రేజీ కోర్సుగా మారుతోంది. సిఎస్‌ఇ పూర్తిచేసిన విద్యార్థులకు జాబ్ మా ర్కెట్‌లో లభిస్తున్న అవకాశాలు, వేతనాలే అందుకు ప్రధాన కారణం. భవిష్యత్తులో కంప్యూటర్ సైన్స్, ఐటీ విభాగాల్లో.. సంఖ్యలో కొలువులు లభిస్తాయనే అంచనాలతో కన్వీనర్ కోటా అయినా.. కోటా సిఎస్‌ఇకే మొగ్గు చూపుతున్నారు. డిప్లొమా నుంచి ఎం.టెక్ వరకూ.. స్థానిక ఇంజనీరింగ్ కాలేజీల నుంచి ప్రతిష్టాత్మక ఐఐటీల వరకు.. దాదాపు అన్ని ప్రవేశ పరీక్షల టాప్ ర్యాంకర్ల తొలి ఛాయిస్‌గా సిఎస్‌ఇ నిలుస్తోంది. ప్రస్తుతకాలంలో ఇంజినీరింగ్ అంటేనే కంప్యూటర్ సైన్స్ అనేలా విద్యార్థులు, తల్లిదండ్రుల మైండ్‌సెట్ మారిపోయింది.

ఏ కోటా అయినా సిఎస్‌ఇకే డిమాండ్

సాఫ్ట్‌వేర్, ఐటి రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటుండంతో తొలి ప్రాధాన్యంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఎంపిక చేసుకుంటున్నారు. సిఎస్‌ఇతో పాటు దాని అనుబంధ బ్రాంచీలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటాసైన్స్, మెషిన్ లెర్నింగ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటి), ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్ ఇంజనీరింగ్(ఇసిఇ), ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ బ్రాంచిలకు ప్రాధాన్య త ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇంజినీరింగ్‌లో చాలా బ్రాంచీ లు అందుబాటులో ఉన్నప్పటికీ మిగతా బ్రాంచీలలో చేరేందుకు విద్యార్థులు ససేమిరా అంటున్నారు. కొందరైతే కం ప్యూటర్ సైన్స్ సీటు లభిస్తేనే ఇంజినీరింగ్ చేయాలి లేదం టే సాధారణ డిగ్రీలు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కన్వీనర్ కోటాలో సిఎస్‌ఇలో సీటు లభించకపోతే ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో యాజమాన్య కోటా లో సుమారు రూ.7 లక్షల నుంచి -10 లక్షల వరకు డబ్బు లు వెచ్చించి కంప్యూటర్ సైన్స్ చేసేందుకు సిద్దమవుతున్నారు. డిమాండ్ లేని కోర్సులు అందుబాటులో ఉన్నప్పటికీ ఆ కోర్సుల్లో చేరేందుకు ముందుకు రావడం లేదు.

99.91 శాతం సీట్లు భర్తీ

మొదటి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపులో కంప్యూటర్ సైన్స్, ఐటి అనుబంధ బ్రాంచీల్లో 99.91 శాతం సీట్లు కేటాయించగా, టెక్నాలజీలో 99.76 శాతం సీట్లు భర్తీ కాగా, సిఎస్‌ఇ సైన్స్)లో 99.64 శాతం, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 99.59 శాతం సీట్లు కేటాయించారు. పలు బ్రాంచీల్లో వంద శాతం సీట్లు కేటాయించారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్ట మ్, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బయో మెడికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ మ్యాట్రి క్స్, మెటలర్జికల్ ఇంజినీరింగ్, బి.టెక్ మెకానికల్ విత్ ఎం.టెక్ థర్మల్ ఇంజినీరింగ్, బి.టెక్ మెకానికల్ విత్ ఎం. టెక్ థర్మల్ సిస్టమ్స్, బయో టెక్నాలజి బ్రాంచీల్లో వంద శాతం సీట్లు కేటాయించారు.

సివిల్, మెకానికల్, అలైడ్ ఇంజనీరింగ్ బ్రాంచీలపై విద్యార్థులు ఆసక్తి కనబరచలేదు. ఈ కోర్సుల అనుబంధ బ్రాంచీల్లో 36.75 శాతం సీట్లకు కేటాయింపులు జరగ్గా, 50 శాతానికి పైగా సీట్లు ఖాళీ గా మిగిలాయి. సివిల్ ఇంజనీరింగ్‌లో 36.38 శాతం సీట్లు భర్తీ కాగా, మెకానికల్‌లో 31.92 శాతం, ప్లానింగ్‌లో 24.44 శాతం సీట్లు కేటాయించారు. అలాగే ఇతర ఇంజినీరింగ్ బ్రాంచీలైన మైనింగ్, కెమికల్, ఫుడ్ టెక్నాలజి, టెక్స్‌టైల్ టెక్నాలజి, ఫార్మసుటికల్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ, డెయిరీయింగ్ తదితర కోర్సులలో 84.45 శాతం సీట్లు కేటాయించారు.

కొత్తగా 78 కాలేజీల్లో 9,240 సిఎస్‌ఇ సీట్లకు అనుమతి

రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ ఏడాది కోర్సులలో మార్పు, కొత్త బ్రాంచీలతో కలిపి 9,240 కంప్యూటర్ సైన్స్, అనుబంధ కోర్సుల్లో సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ విద్యాసంవత్సరం సంప్రదాయ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సుల్లో సీట్లు తగ్గనున్నాయి. వీటి స్థానంలో కంప్యూటర్ సైన్స్‌తో పాటు ఆ బ్రాంచీకి అనుబంధంగా ఉండే బ్రాంచీల సీట్ల సంఖ్య పెరగనున్నాయి. డిమాండ్ లేని కోర్సులను ఎత్తేసి, విద్యార్థులు కోరుకునే కోర్సులకు ప్రాధాన్యం కల్పించేందుకు ప్రైవేటు కళాశాలలకు అఖిలభారత సాంకేతిక విద్యా మండలి(ఎఐసిటిఇ) అవకాశం కల్పించింది. దాంతో రాష్ట్రంలోని కాలేజీలు కొత్త బ్రాంచీలు ప్రారంభించుకోవడంతోపాటు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సుల స్థానంలో కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,డాటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సుల్లో సీట్లు పెంచుకుంటున్నాయి.

టాప్‌టెన్ కళాశాలలకే మొగ్గు

ఇంజనీరింగ్ బ్రాంచీల ఎంత కీలకమో…కళాశాల ఎంపిక కూడా అంతే కీలకంగా మారింది. ఎందుకంటే టాప్ టెన్ కళాశాలల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో మంచి ఉద్యోగాలు లభిస్తున్నాయి. దాంతో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను టాప్‌టెన్ కళాశాలల్లో చేర్పించేందుకే ఆసక్తి కనబరుస్తున్నారు. సాధారణ కళాశాలల్లో సీట్లు అందుబాటులో ఉన్నా ఆ కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి కనబరచడం లేదు. . ఆర్థికంగా స్థోమత ఉన్న విద్యార్థులు టాప్‌టెన్ కళాశాలల్లో యాజమాన్య కోటాలో సీటు పొందేందుకే మొగ్గు చూపుతున్నారు. కొందరు విద్యార్థులు పేరున్న ప్రైవేట్ యూనివర్సిటీలలో ఇంజనీరింగ్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News