Home టెక్ ట్రెండ్స్ జాతీయ కంప్యూటర్ సొసైటి

జాతీయ కంప్యూటర్ సొసైటి

computerడిసెంబర్ 8న నేషనల్ కన్వెన్షన్ ఆఫ్ ద కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా కోయంబత్తూర్‌లో ఆరంభం అయింది. శారీరక వైకల్యం ఉన్న వ్యక్తుల కోసం ఎంటర్‌ప్రైజ్ మొబిలిటీ, డేటా విజువలైజేషన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లాటి టాపిక్స్‌ను అది కవర్ చేస్తుంది. 2016, 51వ సిఎస్‌ఐ వార్షిక సమావేశం ఉద్దేశ్యం, ‘డిజిటల్ అనుసంధానం-సామాజిక ప్రభావం’ అనే అంశంతో ఆరంభించారు. ఆనందకరమైన సమాజానికి డిజిటల్ అనుసంధానం ఒక మార్గం. ఆరోగ్య పరిరక్షణ, విద్య లాటి అంశాలలో డిజిటల్ అనుసంధానం తప్పనిసరి. సాధారణ వ్యక్తులకు కూడా అందుబాటులో ఉండేట్లు సాంకేతికత ఉండటం ఈ జాతీయ కన్వెన్షన్ ముఖ్య ఉద్దేశ్యం అని సిఎస్‌ఐ జాతీయ ప్రెసిడెంట్, అనిర్బన్ బసు అభిప్రా యపడ్డారు. ప్యానల్ చర్చలు, ముం దస్తు కన్వెన్షన్ ట్యుటో రియల్స్, పేపర్ ప్రెజెంటేషన్‌లు, కేస్ స్టడీ అధ్యయనాలు జరిగాయి. వెయ్యి కన్నా ఎక్కువమంది ఐటి ఎకడమీ షియన్లు, కార్పొరేట్లు, ఎగ్జిక్యూ టివ్‌లు, ప్రభుత్వ రంగం, ఇతర భాగస్వాములు ఎంతోమంది ఈ కన్వెన్ష న్‌లో పాలు పంచుకో నున్నారు. దేశ గ్రామీణ ప్రాంతాల్లో కూడా కంప్యూటర్ వాడకం మరింత విస్తరించనుంది.