Thursday, March 28, 2024

ఢిల్లీ అల్లర్లపై కాంగ్రెస్ నిజనిర్ధారణ బృందం

- Advertisement -
- Advertisement -

Sonia Gandhi

న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు జరిగిన ప్రాంతాలను సందర్శించి వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడానికి ఐదుగురు సభ్యుల బృందాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం నియమించారు. ఈ బృందంలో ముకుల్ వాస్నిక్, తారిఖ్ అన్వర్, సుష్మితాదేవ్, శక్తిసిన్హ్ గోహిల్, కుమారి సెల్జా సభ్యులుగా ఉంటారు. ఆయా ప్రాంతాలను సందర్శించిన అనంతరం ఈ బృందం ఒక సవివర నివేదికను పార్టీ అధినేత్రికి సమర్పిస్తుంది. ఈశాన్య ఢిల్లీలో ఇటీవల జరిగిన అల్లర్లలో ఇప్పటివరకు 42 మంది మరణించగా మరో 300 మందికి పైగా గాయపడ్డారు. ఈ హింసాకాండకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యురాలని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాగా, సోనియా గాంధీ నాయకత్వంలో ఒక ప్రతినిధి బృందం గురువారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు కలుసుకుని కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా కోరుతూ ఒక వినతిపత్రాన్ని సమర్పించింది.

Cong forms fact finding panel, Five member Cong panel will visit riot affected areas in NE Delhi and submit a detailed report to Sonia Gandhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News