Home తాజా వార్తలు హరీశ్ రావును సన్మానించిన జగ్గారెడ్డి…

హరీశ్ రావును సన్మానించిన జగ్గారెడ్డి…

 

సంగారెడ్డి: జిల్లా జడ్పీ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి హరీశ్ రావును స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి  సన్మానించారు. జిల్లా అభివృద్ధికి సహకరించాలని మంత్రిని కోరారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశం మొత్తం ఆర్థిక మాంద్యం ఉందని, కేంద్ర ప్రభుత్వం రోజుకోక దాంట్లో కోతలు పెడుతుందని విమర్శించారు. రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం వలన ఇతర ఖర్చులు, కేటాయింపులు తగ్గించామని, కానీ సంక్షేమ కార్యక్రమాలను మాత్రం యధావిధిగా కొనసాగించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారని చెప్పారు.  సంక్షేమ పథకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గదని, ఖచ్చితంగా వాటిని అమలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. రైతు బంధు, బీమాలు సిఎం కెసిఆర్ అమలు చేస్తున్న అద్భుత కార్యక్రమాలని హరీశ్‌రావు ప్రశంసించారు.

Cong MLA Jagga Reddy felicitates Minister Harish Rao