Home తాజా వార్తలు హూప్ ఫౌండేషన్ చైర్మన్ కు అభినందనలు…

హూప్ ఫౌండేషన్ చైర్మన్ కు అభినందనలు…

Hoop Foundation

 

మాదాపూర్ : వేసవి కాలంలో మండుతున్న ఎండలకు పాదచారుల, బాటసారుల దాహార్తిని తీర్చడానికి జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రదేశాలలో చలివేంద్రాలతో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయల్లో వాటర్ కూలర్‌లను అందజేసిన హూప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్‌ని గుర్తించి గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ దానకిషోర్ అభినందించారు. అందుకు వాక్ అలయన్స్ పేరుతో మాదాపూర్‌లోని ఫోనిక్స్ ఏరినలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొండా విజయ్ కుమార్‌ని అభినందించారు.

ఈ సందర్బంగా కమిషనర్ దానకిషోర్ మాట్లాడుతు… త్రాగునీటి కోసం బాటసారులు ఇబ్బందులు ఎదుర్కోకుండ జనసంద్రత ఎక్కవగా ఉండే ప్రాంతాలను గుర్తించి చలివేంద్రలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చడం గొప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో వెస్ట్‌జోన్ జోనల్ కమిషనర్ దాసరి హరిచందన, శేరిలింగపల్లి, చందానగర్ ఉప కమిషనర్లు వెంకన్న, యాదగిరి రావులతో పాటు వివిధ ఐటి కంసెనీల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

 

Congratulations to the Hoop Foundation chairman