- Advertisement -
మన తెలంగాణ/కీసర : పేద విద్యార్థి పైచదువుల కోసం ఆర్ధిక సహయం అందజేయడం అభినందనీయమని మేడ్చల్ జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు, నాగారం సర్పంచ్ కౌకుంట్ల చంద్రారెడ్డి అన్నారు. నాగారం గ్రామానికి చెందిన పేద విద్యార్ధి సింగిరెడ్డి హన్మంత్‌రెడ్డి పైచదువుల కోసం మండల వైస్ ఎంపీపీ మాదిరెడ్డి స్వప్న వెంకట్‌రెడ్డి గురువారం ఆర్ధిక సహయం అందజేశారు. నాగారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించిన హన్మంత్‌రెడ్డి ప్రస్తుతం నగరంలో డిగ్రీ చదువుతున్నాడు. వివిధ విభాగాల్లో కవిత రచనలు చేసి ప్రముఖ కవి స్వర్గీయ సి.నారాయణరెడ్డి ఆశీస్సులు పొందారు. విద్యార్ధి ఆర్ధిక పరిస్థితి తెలుసుకున్న వైస్ ఎంపీపీ పై చదువుల కోసం చేయూతనిచ్చారు.
- Advertisement -