Home జాతీయ వార్తలు కరోనా టీకా వేయించుకున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా

కరోనా టీకా వేయించుకున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా

Congress Chief Sonia Took Corona Vaccineన్యూఢిల్లీ : జాతీయ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కరోనా టీకా వేయించుకున్నారు. మేలో ఆమె మొదటి డోసు టీకా వేయించుకున్నారు. గురువారం ఉదయం ఆమె రెండో డోసు టీకా వేయించుకున్నారు. రాహుల్ మే 16న టీకా వేయించుకోవాల్సి ఉండగా, ఆయన కరోనా బారిన పడడంతో టీకా వేయించుకోలేదు. రాహుల్ నిర్ణీత గడువు ముగిసిన తర్వాత టీకా వేయించుకోనున్నారు. ఇదిలా ఉండగా కరోనా బారిన పడి కోలుకున్న మూడు నెలల తర్వాత టీెకా వేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.