Thursday, April 18, 2024

మా కృషి వల్లనే భారత్‌కు ప్రాజెక్టు చీతా : కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

Congress Claims Credit for Project Cheetah

న్యూఢిల్లీ : చీతాలను భారత్‌కు తీసుకురావడానికి ప్రధాన కారణం తమ పార్టీయేనని కాంగ్రెస్ పేర్కొంది. 14 ఏళ్ల క్రితం కాంగ్రెస్ చేసిన ప్రయత్నాల వల్లనే చీతాలు భారత్‌కు వచ్చాయని పేర్కొంది. 2008-09 లో మన్మోహన్ సింగ్ నేతృత్వం లోని ప్రభుత్వం ప్రాజెక్టు చీతా ప్రతిపాదన సిద్ధం చేసిందని , 2010 ఏప్రిల్‌లో అప్పటి కేంద్ర అటవీ పర్యావరణ మంత్రి జైరాం రమేశ్ ఈ ప్రాజెక్టు కోసం ఆఫ్రికా లోని చీతా ఔట్‌రీచ్ సెంటర్‌కు వెళ్లారని కాంగ్రెస్ ట్విటర్‌లో వివరించింది. ఈ మేరకు చీతాతో జైరాం రమేశ్ ఉన్న ఫోటోను కూడా పంచుకుంది. 2013 లో సుప్రీం కోర్టు ఈ ప్రాజెక్టును నిలిపివేసిందని, తర్వాత 2020లో నిషేధాన్ని ఎత్తివేసినట్టు వెల్లడించింది.

అంతరించిపోయిన ఈ వన్యప్రాణి జాతిని ప్రయోగాత్మకంగా భారత్‌లో తిరిగి ప్రవేశ పెట్టినందుకు ఉద్దేశించిన ప్రాజెక్టు చీతాకు సుప్రీం కోర్టు 2020 జనవరిలో ఆమోద ముద్ర వేసింది. భారతీయ వన్యప్రాణి సంరక్షకులు తొలిసారిగా 2009లో భారత్‌కు చీతాలను రప్పించే ప్రతిపాదనను చీతా కన్జర్వేటివ్ ఫండ్‌కు చెందిన ప్రతినిధుల ముందుంచారు. ఆపై భారత ప్రభుత్వ ఆహ్వానం మేరకు డాక్టర్ మార్కర్ గత 12 ఏళ్లలో పలుమార్లు భారత్‌ను సందర్శించి చీతాను ప్రవేశ పెట్టడానికి ఉద్దేశించిన ప్రాంతాన్ని , ముసాయిదా ప్రణాళికలను పరిశీలించారు. చీతాల సంరక్షణ అంశంపై ఈ ఏడాది జులై 20న నమీబియా, భారత్‌లు పరస్పర అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News