Friday, March 29, 2024

మణిపూర్ హింసపై కాంగ్రెస్ నిజనిర్ధారణ కమిటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మణిపూర్‌లో ఇటీవల చెలరేగిన హింసాకాండకు కారణాలు తెలుసుకోడానికి, ప్రస్తుత పరిస్థితిని అంచనా వేయడానికి ముగ్గురు సభ్యులతో కూడిన నిజనిర్ధారణ కమిటీని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బుధవారం నియమించారు. ఈ బృందంలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ఎంపి ముకుల్ వాస్నిక్, పార్టీ ఎమ్‌ఎల్‌ఎ సుదీప్ రాయ్ బర్మన్ సభ్యులుగా ఉన్నారు. వీరికి సమన్వయ కర్తలుగా మణిపూర్ ఏఐసిసి ఇన్‌ఛార్జి , పీసీసీ అధ్యక్షుడు , సిసిఎల్ నేత వ్యవహరిస్తారు.

మణిపూర్ కాంగ్రెస్ నేత , మాజీ సిఎం ఒక్రమ్ ఇబోబి సింగ్, ఆ పార్టీ సీనియర్ నేతలు ఖర్గేను ఢిల్లీలో కలుసుకుని రాష్ట్రంలో పరిస్థితిని వివరించారు. అక్కడి ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్న విషయాన్ని మణిపూర్ నేతలు తనకు వివరించారని, అక్కడి పరిస్థితులు ఇప్పటికీ ఉద్రిక్తం గానే ఉన్నాయని ఖర్గే పేర్కొన్నారు. అందుకే వాస్తవ పరిస్థితులను తెలుసుకోడానికి పరిశీలకుల బృందాన్ని పంపుతున్నామని చెప్పారు.

సుప్రీం కోర్టుకు కేంద్రం స్థాయీ నివేదిక
మణిపూర్‌లో పరిస్థితి మెరుగైనట్టు కేంద్రం, రాష్ట్రప్రభుత్వం బుధవారం సుప్రీం కోర్టుకు స్థాయీ నివేదికను అందజేశాయి. రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం కోర్టుకు విన్నవించారు. 315 రిలీఫ్ క్యాంపులను జిల్లా పోలీస్‌లు , సెంట్రల్ ఆర్మీ పోలీస్ ఫోర్స్ ఏర్పాటు చేశాయని తెలిపారు. సహాయక చర్యల కోసం రూ.3 కోట్ల కంటెంజెన్సీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పారు.ఇంతవరకు 46,000 మందికి సాయం అందజేశామని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News