Saturday, April 20, 2024

కరోనా నేపథ్యంలో కర్ణాటకలో ‘మేకెదాటు’ పాదయాత్ర నిలిపివేత

- Advertisement -
- Advertisement -

Congress Halts Mekedatu Padayatra Amidst Rising Covid

బెంగళూరు : కర్ణాటకలో వివాదాస్పదంగా మారిన మేకెదాటు పాదయాత్రను నిలిపివేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ గురువారం ప్రకటించింది. మేకెదాటు ప్రాజెక్టు విషయంలో బిజెపి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమం చేపట్టింది. అయితే ఇందులో పెద్ద ఎత్తున కరోనా కేసులు బయటపడుతుండడంతో కలకలం రేగుతోంది. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొన్న రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే , సీనియర్ నేత వీరప్ప మొయిలీ తదితరులకు తాజాగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరు కాక సిద్దరామయ్య, మేయర్ మల్లికార్జున్ తదితరులకు లక్షణాలు బయటపడ్డాయి.

ఈ నేపథ్యంలో సాయంత్రం నిలిపివేస్తున్నట్టు పార్టీ నేతలు గురువారం ప్రకటించారు. ఒమిక్రాన్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ వందలాది మంది ఈ ర్యాలీలో పాల్గొంటుడటంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. బిజెపి నేతలు దీన్ని సూపర్ స్ప్రెడర్ ర్యాలీగా అభివర్ణిస్తూన్నారు. ఈ క్రమం లోనే నిబంధనలు ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డికె శివకుమార్ , రాష్ట్రంలో ప్రతిపక్ష నేత సిద్దరామయ్యా తదితర 40 మందిపై కేసులు నమోదయ్యాయి. కరోనా దృష్టా ఈ ర్యాలీని వెంటనే ఆపాలని ఆ రాష్ట్ర సిఎం బసవరాజ్ బొమ్మై కాంగ్రెస్‌కు లేఖ రాశారు. ఈ పాదయాత్రకు ఎందుకు అనుమతిచ్చారని, దాన్ని ఆపేందుకు ఎందుకు చర్యలు తీసుకోలేదని కర్ణాటక హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News