Thursday, March 28, 2024

భూతగాదాలతోనే కాంగ్రెస్ నేత హత్య

- Advertisement -
- Advertisement -
Congress leader murder with land disputes at Shadnagar
నిందితుల అరెస్టు, రిమాండ్‌కు తరలింపు : షాద్‌నగర్ ఎసిపి

రంగారెడ్డి: భూ తగాదాల వల్లే ఈ నెల 19వ తేదీన కాంగ్రెస్ సీనియర్ నేత, సింగిల్ విండో మాజీ చైర్మన్ రామచంద్రారెడ్డి హత్యకు గురయ్యారని షాద్‌నగర్ ఎసిపి సురేందర్ తెలిపారు. సోమవారం షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో రామచంద్రారెడ్డి హత్య కేసు వివరాలను వెల్లడించారు. ఫరూఖ్‌నగర్ మండలం, అన్నారం గ్రామంలోని 36 ఎకరా ల భూమి విషయమై మృతుడు రాంచంద్రారెడ్డికి, భీంరెడ్డి ప్రతాప్‌రెడ్డికి మధ్య చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ భూమి విషయం లో ఇరువురు కోర్టులను ఆశ్రయించారు. తాతల నుంచి వచ్చిన 36 ఎకరాల భూమిలో తనకూ వాటా ఉందని బీంరెడ్డి ప్రతాప్‌రెడ్డి వాదిస్తున్నాడు. ఇందుకు రాంచంద్రారెడ్డి నిరాకరిస్తూ వచ్చాడు.

ఈ నేపథ్యంలోనే హత్య జరిగినట్లు ఎసిపి తెలిపారు. భీంరెడ్డి ప్రతాప్‌రెడ్డి, అతని డ్రైవర్ దొడ్డి విజయ్‌కుమార్ హత్యకు పథకం వేసినట్లు తెలిపారు. ఈ నెల 19న భూమి తగాదా విషయమై రాంచంద్రారెడ్డికి, భీం రెడ్డి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుకున్న ట్లు తెలిపారు. భీంరెడ్డి ప్రతాప్‌రెడ్డి కొంత నగదు ఇవ్వాలని రాంచంద్రారెడ్డిని కోరగా అందుకు ఆయన నిరాకరించాడు. దీంతో అతని వాహనంలో నే కిడ్నాప్ చేసి కొత్తూరు మండలం, పెంజర్ల గ్రామ సమీపంలో హత్య చేసినట్లు ఎసిపి సురేందర్ వివరించారు. సోమవారం హైదరాబాద్‌నుంచి నిందితులు షాద్‌నగర్‌కు బస్సులో వస్తుండగా కేశంపేట బైపాస్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి రిమాండ్ తరలిస్తున్నట్లు ఎసిపి తెలిపారు. సమావేశంలో సిఐలు శ్రీధర్‌కుమార్, రామకృష్ణ, ఎస్‌ఐలు విజయ్ భాస్కర్,సురేష్,ఐడి పార్టీ పోలీసులు పాల్గొన్నారు.

Congress leader murder with land disputes at Shadnagar

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News