Home తాజా వార్తలు కుక్కలకు ఆ గవర్నర్ పేరు: సంజయ్

కుక్కలకు ఆ గవర్నర్ పేరు: సంజయ్

Sanjay-Nirupam

బెంగళూరు: కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ కర్నాటక గవర్నర్ వాజూ భాయ్ వాలా పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కర్నాటకలో శాసన సభ ఎన్నికలు జరిగిన అనంతరం కర్నాటక రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్- జెడిఎస్ పార్టీలకు మెజారిటీ ఉన్నప్పటికి బిజెపిని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ పిలిచిన విషయం తెలిసిందే. దీనిని ఉద్దేశిస్తూ సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. బిజెపికి వాజూభాయ్ విశ్వాసానికి మారుపేరుగా నిలిచారన్నారు. ఇప్పటి నుంచి ఇంట్లో పెంచుకునే కుక్కలకు వాజూభాయ్ అని పేరు పెట్టుకొవచ్చని వివాదాస్పదంగా మాట్లాడారు. కర్నాటకలో మెజారిటీ ఉన్న కాంగ్రెస్-జెడిఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. బుధవారం కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. యడ్యూరప్ప సిఎంగా ప్రమాణస్వీకారం చేసి మూడు రోజుల తరువాత రాజీనామా చేశారు.