- Advertisement -
మనతెలంగాణ/నందిపేట: మండలానికి చెందిన సీనియర్ కాంగ్రేస్ నాయకులు గురువారం ఎంపి కవిత, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధిని చూసి టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. పార్టీలో చేరిన వారిలో మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మచ్చర్ల సాయన్న, సీనియర్ కాంగ్రేస్ నాయకులు, అయిలాపూర్ మాజీ సింగిల్‌విండో చైర్మన్ కొత్తూర్ రాజేశ్వర్, కాంగ్రెస్ కిసాన్‌సెల్ మండల అధ్యక్షుడు మంద సాయన్న, మంద మొగులాజీలతో పాటు 400 మంది అనుచరులతో పార్టీలో చేరారు. వీరికి ఎంపి కవిత పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వీరి వెంట నాయకులు మీసాల సుదర్శన్, దశాగౌడ్ తదితరులు ఉన్నారు.
- Advertisement -