Home తాజా వార్తలు హరీష్‌రావుతో జగ్గారెడ్డి భేటి…

హరీష్‌రావుతో జగ్గారెడ్డి భేటి…

MLA Jagga Reddy

 

మన తెలంగాణ/హైదరాబాద్: అవకాశం చిక్కినప్పుడల్లా మంత్రి హరీష్‌రావుపై విరుచుకపడే కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సంగారెడ్డి ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి గురువారం అందుకు విరుద్దంగా వ్యవహరించారు. అసెంబ్లీలోని మంత్రి హరీష్‌రావు ఛాంబర్‌లోకి నేరుగా వెళ్ళి కొద్దిసేపు మంతనాలు జరిపారు. వారిద్దరి భేటిపై అటు టిఆర్‌ఎస్‌లనూ, ఇటు కాంగ్రెస్ వర్గాల్లోనూ కొద్దిసేపు ఆశ్చర్యానికి గురి చేసింది. అనంతరం బయటకు వచ్చిన జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేవలం తన నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరడానికి మంత్రి హరీష్‌రావును కలిశానని చెప్పుకొచ్చారు. ఇందులో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. దీనిపై అనవసరంగా లేనిపోని ఊహాగానాలను మీడియా సృష్టించవద్దని కోరారు. నియోజకవర్గం సమస్యల పరిష్కారం కోసమే 14 సంవత్సరాల తరువాత హరీష్‌ను కలిసినట్లు జగ్గారెడ్డి తెలిపారు. కాగా తాను విన్నవించిన సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు.

Congress MLA Jagga Reddy meet Minister Harish Rao