Monday, June 23, 2025

బిఆర్ఎస్ లో దెయ్యాలు ఎవరో కవిత చిత్తశుద్ధితో చెప్పాలి: చామల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్ఎస్, బిజెపి కలిసి రాజకీయ నాటకాలకు తెరలేపాయని ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar reddy) తెలిపారు. ఎమ్మెల్సి కవిత వ్యాఖ్యలపై చామల స్పందించారు. తాము ఊహించినట్లుగా బిజెపితో బిఆర్ఎస్ బేరసారాలు చేసిందని విమర్శించారు. కవిత లిక్కర్ కేసు నుంచి బయటపడేసేందుకు బిజెపికి మద్దతు ఇచ్చారని, ఎమ్మెల్సి ఎన్నికలల్లోనూ బిజెపికి బిఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎంపిగా తనకు తెలిసినంత వరకు తమకు కవిత అవసరం లేదని చెప్పారు. బిఆర్ఎస్ లో దెయ్యాలు ఎవరో కవిత చిత్తశుద్ధితో చెప్పాలని సూచించారు. మాజీ సిఎం కెసిఆర్ ఒక్కరే లీడర్ అని చెప్పడంలో ఆంతర్యం ఏమిటీ? అని చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News