Home తాజా వార్తలు ఉదయ సముద్రానికి అడ్డుపడుతున్న కాంగ్రెస్

ఉదయ సముద్రానికి అడ్డుపడుతున్న కాంగ్రెస్

HARISH-6

హైదరాబాద్ : నల్గొండ జిల్లాలోని ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకానికి కాంగ్రెస్ అడ్డుపడుతోందని మంత్రి హరీష్‌రావు ధ్వజమెత్తారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా హరీష్‌రావు మాట్లాడారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు కేసులు వేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఉదయ సముద్రం కోసం 123జిఒ కింద 140 ఎకరాల భూ సేకరణ చేశామన్నారు. మిగిలిన భూమిని ఇచ్చేందుకు రైతులు అంగీకరించారని తెలిపారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు 123జిఒపై స్టే తెచ్చారన్నారు. కాంగ్రెస్ నేతలు కేసులు విత్‌డ్రా చేసుకుంటే ఈ ప్రాజెక్టును పది నెలల్లో పూర్తి చేస్తామని హరీష్‌రావు స్పష్టం చేశారు.