మన తెలంగాణ / ఆదిలాబాద్ బ్యూరో: సాధారణ ఎన్నికలు ముందస్తుగానే జరగనున్నట్లు వెలువడుతున్న సంకేతాల కారణంగా ప్రతి పక్ష కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా అప్రమత్తం అయ్యేందుకు సన్నాహలు చేస్తోందంటున్నారు. వివిధ పథకాలు, ప్రకటనల కారణంగానే కాకుండా పలు సంస్థలు నిర్వహిస్తున్న సర్వే నివేధికలను ప్రాతిపదికగా చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ తమ భవిష్యత్తు రాజకీయ కార్యాచరణను రూపొందించడంలో నిమగ్నమవుతోంది. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తం కుమార్ రెడ్డి డిసెంబర్‌లోనే ఎన్నికలు కావచ్చని చేసిన ప్రకటన ఆ పార్టీ వర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. గత కొద్ది రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని పార్టీ జిల్లా అధ్యక్షులతో ఉత్తం కుమార్ రెడ్డి సిరియస్‌గా సమీక్ష సమావేవం నిర్వహించి వారికి దిశ నిర్దేశం చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలేటి మహేశ్వర్ రెడ్డితో పార్టీ పరిస్థితులపైనే కాకుండా అధికార టిఆర్‌ఎస్ పార్టీ అనుసరిస్తున్న వ్యూహం, అభివృద్ది, సంక్షేమ పథకాలపై ప్రజల్లో నెలకొంటున్న భవన తదితర అంశాలపై ఆరా తీసినట్లు సమాచారం ఈ సమీక్ష సమావేశంలోనే జిల్లాలో పార్టీని మరిత పటిష్టపరిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని సైతం రూపొందించినట్లు సమాచారం. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి చెందిన ఓ ప్రైవేట్ సర్వే సంస్థ ద్వారా రాష్ట్రంలోని 119 నియోజకవర్గల్లో రాజకీయ స్థితిగతులపై, పార్టీ పరిస్థితిపై సర్వే నిర్వహించినుట్లు చెబుతున్నారు. ఈ సర్వే ప్రకారం దాదాపు 70 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందనున్నట్లు నిర్ధరాణ అయిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సర్వే నివేదిక ఆధారంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నాలుగైదు స్థానా లను కాంగ్రెస్ గెలుచుకునే అవకాశాలు ఉన్నట్లు కూడా వెల్లడైందంటున్నారు. పార్టీ నాయకులు, శ్రేణులు సమిష్టిగా కృషి చేస్తే సర్వే నివేదికలను నిజాం చేసుకోవచ్చని అలాగే అదనంగా మరో రెండు మూడు స్థానల్లో సైతం పార్టీ గెలుపించుకునే అవకా శాలు ఏర్పడుతాయని టీపీసీసీ అధ్య క్షులు ఉత్తం కుమార్ రెడ్డి తన సమీక్షలో వెల్లడించినట్లు సమాచారం. ఇక నుండి వరుసగా పార్టీ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతూ జనం మధ్యలో పార్టీని, నేతలను నిలిపేట్లు చూడాలని నిర్ణయించారు. గ్రామ స్థాయి నుండి పార్టీ కార్యక్రమాలను చేపడుతూ నిరాశ నిస్పృహలో ఉన్నకార్యకర్తలను కార్యోణ్ముకులను చేసేందుకు యాక్షన్ ప్లాన్‌ను రూపొంది స్తున్నారు. దీనికి తోడు అధికార టీఆర్‌ఎస్ పార్టీపై ఎదురు దాడి కొనసా గించాలని నిర్ణయించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల లోని లోసుగు లను స్థానిక అధికార పార్టీ నాయకుల అవినీతి అక్రమాలను హైలైట్ చేస్తు జనాన్ని ఆకర్షించాలని నిర్ణయించారు. దీనికి తోడుగా అధి కార పార్టీలో రోజురోజుకు విస్తరిస్తున్న గ్రూపు తగాదాలు, అసంతృప్తి నేత ల మధ్య అభిప్రాయబేధాలను అనుకూలంగా మలుచుకుంటూ వారిని కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులయ్యేవిధంగాకూడా చూడనున్నారు. ఇలా వ్యూహత్మ కంగా వరుస కార్యక్రమాలు ఓవైపు అధికార పార్టీలోని లోసుగు లను ఆసరాగా చేసుకుంటూ మరో వైపు రాబోయే ఎన్నికల వరకు పార్టీలో సమరో త్సాహం నింపడమే కాకుండా గెలుపే లక్షంగా ఆ పార్టీ ముందు కు సాగాలని నిర్ణ యించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోబో తుందంటున్నారు.