Thursday, April 25, 2024

జెండా ఊడి సోనియా చేతుల్లో పడింది

- Advertisement -
- Advertisement -
Congress party flag falls
వైరల్ అయిన వీడియో

న్యూఢిల్లీ: కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో అనుకోని సంఘటన జరిగింది. మూడురంగుల జెండాను ఎగురవేసేందుకు సోనియాగాంధీ ప్రయత్నిస్తుండగా అది ఊడి ఆమె చేతుల్లో పడింది. సోనియా జెండా ఎగురవేసే సమయంలో జెండాకు కట్టిన దారం మెలికపడి తేలిగ్గా రాకపోవడంతో అక్కడ ఉన్న ఆమె సహాయకులు వచ్చి గట్టిగా లాగారు. దాంతో, జెండా ఊడి సోనియా చేతుల్లో పడింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సంఘటన జరిగిన సమయంలో కాంగ్రెస్ నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, ఎకె ఆంటోనీ, మల్లికార్జునఖర్గే అక్కడే ఉన్నారు. పార్టీ నాయకత్వం ఈ సంఘటన పట్ల అసహనం వ్యక్తం చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కార్యక్రమం ఇంచార్జీకి సూచించామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News