Friday, March 29, 2024

హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికలకు మెనిఫెస్టో విడుదలచేసిన కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

సిమ్లా: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్ సమక్షంలో నవంబర్ 12న జరుగనున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ శనివారం మెనిఫెస్టో విడుదలచేసింది. పాత పింఛను పథకాన్ని అమలు చేస్తానని వాగ్దానం చేసింది. ప్రతి నియోజకవర్గంలో 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, రూ. 10 కోట్ల ‘స్టార్టప్ ఫండ్’ ఇస్తానన్నది. కాంగ్రెస్ ఎన్నికల మెనిఫెస్టో విడుదల సందర్భంగా ఆ కార్యక్రమానికి హాజరైన వారిలో హిమాచల్ ఏఐసిసి ఇన్‌ఛార్జి రాజీవ్ శుక్లా, మాజీ పిసిసి చీఫ్ సుఖ్‌వీందర్ సింగ్ సుఖు, ఏఐసిసి కార్యదర్శులు తేజిందర్ పాల్ బిట్టు, మనీశ్ ఛత్రత్ ఉన్నారు. పార్టీ పోల్ మెనిఫెస్టో కమిటీ చైర్మన్ ధనీరామ్ శందిల్ మాట్లాడుతూ ప్రజలు కోరుకున్న దానికి అనుకూలంగా బిజెపి వ్యవహరించడంలో విఫలమైందని, ఐదేళ్ల క్రితం చేసిన వాగ్దానాలు అసలు నెరవేర్చనేలేదని అన్నారు. “ఇది కేవలం ఎన్నికల మెనిఫెస్టో మాత్రమే కాదు, హిమాచల్‌ప్రదేశ్ ప్రజల అభివృద్ధి, సంక్షేమంకు సంబంధించిన డాక్యుమెంట్‌” అని శందిల్ చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News