Thursday, April 25, 2024

బిట్‌కాయిన్‌పై కాంగ్రెస్ రాజకీయాలు

- Advertisement -
- Advertisement -

Congress Politics on Bitcoin: Karnataka CM accused

బిట్‌కాయిన్‌పై కాంగ్రెస్ రాజకీయాలు
కర్నాటక సిఎం ఆరోపణ

బెంగళూరు: బిట్‌కాయిన్ కుంభకోణం పేరిట కాంగ్రెస్ పార్టీ రాజకీయానికి పాల్పడుతోందని కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సోమవారం ఆరోపించారు. కాంగ్రెస్ వద్ద ఇందుకు సంబంధించి సాక్ష్యాధారాలు ఏవైనా ఉంటే వాటిని దర్యాప్తు సంస్థలకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ బిట్‌కాయిన్ కుంభకోణం గురించి కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆరోపణలు చేస్తోందని, వారి వద్ద ఆధారాలుంటే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు కాని పోలీసులకు కాని అందచేయాలని అన్నారు. లేని సమస్యను ఉన్నట్లుగా చూపాలన్నదే కాంగ్రెస్ అసలు ఉద్దేశమని, ఇది రాజకీయం తప్ప మరేమీ కాదని ఆయన వ్యాఖ్యానించారు. బిట్‌కాయిన్ కుంభకోణం అంటూ ఏదీ లేకుండానే అదేదో ఉన్నట్లు కాంగ్రెస్ కట్టుకథలు చెబుతోందని ఆయన విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News