Home రాష్ట్ర వార్తలు కాంగ్రెస్‌ను గెలిపించి సోనియాకు కానుకగా ఇవ్వాలి

కాంగ్రెస్‌ను గెలిపించి సోనియాకు కానుకగా ఇవ్వాలి

uttam

సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా గాంధీ భవన్ సభలో నేతలు 

హైదరాబాద్: 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వా న్ని ఏర్పాటు చేసి సోనియాగాంధీకి కానుకగా ఇవ్వాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకు లు పిలుపు నిచ్చారు. కెసిఆర్ పాలన తెలంగాణ రాష్ట్రానికి శాపంగా మారిందన్నారు. ‘కెసిఆర్‌కు హటావో, తెలంగాణకు బచావో’ అనే నినాదంతో కెసిఆర్ కుటుంబం చేతిలో బందిగా మారిన తెలంగాణ రాష్ట్రాన్ని విముక్తి చేయాలన్నారు. ప్రజా వ్యతిరేక విధానాను అవలంభిస్తూ అవినీతికి పాల్పడుతున్న టిఆర్‌ఎస్ పాలను చరమగీతం పాడేందుకు గ్రామ గ్రామాన పర్యటించి ప్రజలను చైతన్యవంతులను చేయాలని పిలుపునిచ్చారు. సోనియాగాంధీ 71వ జన్మదిన వేడుకలను గాంధీభవన్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ గ్రేటర్ కమిటీ ఆధ్వర్యంలో గాంధీభవన్ ఆవరణలో కృతజ్ఞత సభ నిర్వహించారు. టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మహాతల్లి సొనియాగాంధీ అని కొనియాడారు. ఆమెకు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా ఆ పదవిని చేపట్టలేదని గుర్తు చేశారు. టిఆర్‌ఎస్ మూడున్నరేళ్ల పాలనలో అన్ని వర్గాలు తీవ్ర నైరాశ్యం, అసంతృప్తిలో ఉన్నారన్నారు. 2019ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోనికి వస్తే రైతులకు ఏక కాలంలో రూ. 2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని, లక్షలాధి ఉద్యోగాలను కల్పిస్తామని, ఉద్యోగాలు రానివారికి రూ.3 వేల నిరుద్యోగ భృతిని చెల్లిస్తామని హామీనిచ్చారు. వరికిరూ. 2వేలు, పత్తికి రూ.5వేలు, మిర్చి కిరూ.10వేలు తగ్గకుండా కనీస మద్దతు ధరను కల్పిస్తామన్నారు. తాము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని, ప్రాజెక్టు పేరిట చేసే దోపిడీకి మాత్రమే వ్యతిరేకమని స్పష్టం చేశారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టుల కమీషన్ల కోసమే పనిచేస్తుందని ఆరోపించారు.
కెసిఆర్ కృతఘ్ఞుడు :జైపాల్‌రెడ్డి
మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ సోనియాగాంధి జన్మదినం తెలంగాణకు పుణ్యదినమన్నారు. అరవై ఏళ్లుగా వేదిస్తున్న సమస్యకు సోనియాగాంధీ పరిష్కరించిందన్నారు. కెసిఆర్ కృతఘ్ఞు డు ,దుర్మార్గపు పాలన చేస్తున్నారని, ఆయన మోసపు మాటలను నమి ప్రజలు మోసపోయారని పేర్కొన్నారు. కెసిఆర్‌ను దించేందుకు రాజకీయ పునరేకీకరణ జరగాలని, అందులో భాగమే రేవంత్‌రెడ్డి పలువురి చేరికలన ఆయన వివరించారు. 2019లో రాష్ట్రం తో పాటు ఎర్రకోటపై కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ యుపిఎ ప్రభుత్వం అనేక చారిత్రాత్మక చట్టాలను ప్రవేశపెట్టిందన్నారు. ఎస్.సి.ఎస్‌టి. సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధకల్పించారని ఆయన గుర్తు చేశారు.
జానా అమాయకత్వంతోనే కెసిఆర్ సిఎంః సర్వే
మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ జానారెడ్డి అమాయకత్వంతోనే కెసిఆర్ సిఎం అయ్యారన్నారు. “కాంగ్రెస్ వస్తే నువ్వే సిఎం..టిఆర్‌ఎస్ వస్తే నేను సిఎం అని జానారెడ్డి కెసిఆర్ అనుకున్నట్లుగా ఉన్నదని వ్యాఖ్యానించారు. ఆనాడు కెసిఆర్, జానారెడ్డిలు పరస్పరం కౌగిలి వల్లనే జెఎసి ఆవిర్భవించిందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై సోనియాగాంధీ స్పష్టత ఇచ్చిన తర్వాత నాడు జెఎసి ఏర్పాటు చేయాల్సిన అవసరమే లేకుండేనని ఆయన పేర్కొన్నారు.
కెటిఆర్ సతీమణిది ఏ సామాజిక వర్గం : రేవంత్
మంత్రి కెటిఆర్ సతీమణి తండ్రి, కెసిఆర్ వియ్యంకుడు గిరిజన రిజర్వేషన్ కోటాలో తప్పుడు పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగం పొందారని, ఇప్పుడూ పెన్షన్ పొందుతున్నారని కాంగ్రెస్ నేత ఎ.రేవంత్‌రెడ్డి విమర్శించారు. తాను చేసే ఆరోపణలు తప్పుగా ఉంటే తనపై కేసు నమోదుచేయాలని, కాదంటే వియ్యంకునిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సిఎంకు ఆయన సవాల్ విసిరారు. ఇంతకు కెటిఆర్ సతీమణి ఏ సామాజిక వర్గానికి చెందుతారో సమధానంచెప్పాలని డిమాండ్ చేశారు.