Thursday, April 25, 2024

ధరణిపై కాంగ్రెస్ పోరు.. 5న కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా

- Advertisement -
- Advertisement -

ధరణిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టి.రాంమోహాన్ రెడ్డి అన్నారు. గురువారం మాజీమంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన వికారాబాద్ పట్టణంలోని సాకేత్ నగర్‌లో ఉన్న మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాంమోహాన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 5వ తేదిన వికారాబాద్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ధరణిలో ఉన్న సమస్యలపై ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు పూర్తిగా రుణమాఫి చేయాలని, ప్రస్తుతం 25 వేలు కూడా చేయలేదని అన్నారు. గతంలో పేదలకు కొన్ని లక్షల ఎకరాల భూమిని పంచామని, ప్రస్తుం టిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల నుండి భూమిని లాక్కుంటుందని అన్నారు. గిరిజనులకు అటవి భూమి పై మన్మోహాన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్న సమయంలో అటవి భూమి పై రైతులకు పూర్తి హక్కు కల్పించామని అన్నారు. రైతులు పొలంలోకి వెళ్లకుండా కందకాలు తొవ్వడం సరి కాదని అన్నారు.

గతంలో 70వేల కోట్ల రూపాయలను మాఫి చేశామని, రుణమాఫి పత్రాలను రైతులకు అందించామని అన్నారు. ప్రస్తుతం రైతు సమస్యల పై పట్టించుకునే నాథుడు తెలంగాణ ప్రభుత్వంలో లేరని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయలను ఏక కాలంలో మాఫి చేస్తామని అన్నారు. భూమి లేని నిరుపేదలకు భూమి ఇస్తామని, లావీణి పట్టా భూములను అమ్ముకోవడానికి, కొనడానికి అవకాశం కల్పిస్తామని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, రైతుబంధు క్రింద ఏడాదికి 15 వేలు ఇస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధిహామి పనులను వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తామని అన్నారు. అప్పా జెంక్షన్ నుండి మన్నెగూడ వరకు మంజూరైన రోడు పనులకు స్థల సేకరణ చేయడానికి తెలంగాణ ప్రభ్వునికి చేత కావడం లేదని అన్నారు.

జైపాల్ రెడ్డి కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు వికారాబాద్‌కు షాట్‌లైట్ టౌన్ కింద ఎన్నో నిధులు తెచ్చామని అన్నారు. సిఎం కెసిఆర్ ఆయన జిల్లాను అభివృద్ది చేస్తున్నాడు కానీ, వికారాబాద్ జిల్లా అభివృధ్దిని మరిచిపోయాడని అన్నారు. దళితబంధు పథకం ఎమ్యెల్యే అనుచరులకు మాత్రమే ఇస్తున్నారని, దీనిని హైకోర్టు నిలిపి వేసిందని అన్నారు. ఇకముందు దళితబంధు పథకానికి ఆన్‌లైన్లోనే అప్లై చేసుకునే అవకాశం వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అర్ధ సుధాకర్ రెడ్డి, కిషన్ నాయక్, రత్నారెడ్డి, మండల అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, చాపల శ్రీనివాస్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News