Friday, March 29, 2024

మెదక్ జిల్లాలో కాంగ్రెస్ ఖాళీ

- Advertisement -
- Advertisement -

Congress vacancy in Medak district

 

ఉన్నకాస్త క్యాడర్ కూడా మంత్రి సమక్షంలో గులాబీ గూటికి
ఐదుగురు కౌన్సిలర్లతో సహా 500 మంది కార్యకర్తలు టిఆర్‌ఎస్‌లో చేరిక
అభివృద్ధిలో వెనుకడుగు వేసేది లేదు : మంత్రి హరీష్‌రావు

మన తెలంగాణ/మెదక్ ప్రతినిధి : తెలంగాణ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యమని అందుకే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కౌన్సిలర్లు సైతం నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశ్యంతో ఈ రోజు టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జికెఆర్ గార్డెన్‌లో పార్టీ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పట్టణంలోని ఐదు వార్డులకు చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్లు 8వ కౌన్సిలర్ వై. జయశ్రీ, 9వ వార్డు కౌన్సిలర్ మేడి కళ్యాణి, 16వ వార్డు కౌన్సిలర్ వసంత్‌రాజ్, 28వ వార్డు కౌన్సిలర్ ఎస్. మమత, 29వ వార్డు కౌన్సిలర్ బోద్దుల రుక్మిణిలు మంత్రి సమక్షంలో టిఆర్‌ఎస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. అనంత రం మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ… దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర సర్కార్ రైతులకు అత్యంత మేలు కలిగించే పథకాలను ప్రవేశపెడుతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతు శ్రేయస్సుకు వ్యతిరేకమైన బిల్లులను ప్రవేశపెడుతుందన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ డిల్లీలో సిఎంపై పోరాటం చేయమంటే తెలంగాణలోని కాంగ్రెస్ గల్లీ లీడర్లు మాత్రం సిఎంపై విమర్శలను గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో 9 గంటల కరెంట్ ఇస్తామని మాట తప్పారని, మాట ఇవ్వకపోయినా, రైతులు అడుగక పోయినా, మోటార్లు కాల ని, ట్రాన్స్‌ఫార్మర్లు పేలని 24 గంటలు నాణ్యమైన ఉచిత కరెంటు పల్లెపల్లెకు ప్రతి వ్యవసాయ రైతుకు ఇస్తున్న ఏకై నా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమేనని మంత్రి అన్నారు. నిజాం కాలం నుండి సమైఖ్య పాలన వరకు రైతు నుండి పన్నులు, సిస్తు వసూలు చేశారని, కానీ రైతు కే పెట్టుబడి సాయం చేసి చరిత్రను తిరగరాసి దేశంలోనే సిఎం కెసిఆర్ సరికొత్త చరిత్ర సృష్టించారన్నారు. ఆనాటి నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు పాలించిన ప్రభుత్వాలు రైతు వద్ద నుండి పన్నులు వసూలు చేస్తే వ్యవసా యం చేసే రైతుకే 10వేల రూపాయలు ఇచ్చి దేశానికే దశ, దిశ చూపించింది టిఆర్‌ఎస్ ప్రభుత్వం కాదా అంటూ ఏ రాష్ట్రంలోనైనా ఇలా చేస్తున్నారా అని కాంగ్రె స్, బిజెపి ప్రభుత్వాలను మంత్రి హరీష్ ప్రశ్నించారు. దుబ్బాక ఉప ఎన్నికలు వచ్చాయి.

జాతీయ పార్టీ అని పేరున్న కాంగ్రెస్ ఇప్పటివరకు అడుగుపెట్టలేదు. కనీసం కార్యకర్తల మీటింగ్ కూడా పెట్టలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బిజెపి కుమ్మక్కైందని మరో పక్క డిల్లీలో కాంగ్రె స్ పార్టీ బిజెపిపై పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రహస్య చీకటి ఒప్పందాలు చేసుకున్నాయని మంత్రి అన్నారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు తిట్టినా దీవెన లు గానే భావించి బంగారు తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు కృషి చేద్దామని పిలుపునిస్తూ.. అందరం కలిసి సిఎం కెసిఆర్ నేతృత్వంలో జిల్లా ప్రజల సంక్షేమం కోసం పాటుపడుదామని కార్యకర్తలకు మంత్రి పిలుపునిచ్చారు. ఎంఎల్‌ఎ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఎంఎల్‌సి ఫారూఖ్‌ఉస్సేన్, మెదక్ మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్, టిఆర్‌ఎస్ పార్టీ పట్టణాధ్యక్షులు గంగాధర్, మాజీ కౌన్సిలర్ మేడి మధూసూదన్‌రావు, మాజీ మార్కెట్ కమిటీ సభ్యు లు కొండ శ్రీనివాస్‌తో పాటు పలువురు కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదీతరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News