Home తాజా వార్తలు కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకల్లో రాహుల్ గాంధీ

కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకల్లో రాహుల్ గాంధీ

Rahul-Gandhiన్యూఢిల్లీ: కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలలో ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఎఐసిసి కార్యాలయంలో పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నోట్ల రద్దుతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.

అసలు ఈ నిర్ణయంతో సామాన్యులకు ఒరిగిందేమిటని ప్రశ్నించారు. అచ్చెదిన్ అన్నా మోడీ దేశ ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారని విమర్శించారు. పేదలను ప్రధాని బలి తీసుకుంటున్నారని మండిపడ్డారు.