Wednesday, April 24, 2024

రాజ్‌నాథ్ ప్రకటన.. కాంగ్రెస్ వాకౌట్

- Advertisement -
- Advertisement -

Congress walks out after Rajnath Singh statement

న్యూఢిల్లీ: భారత్ తో చైనా కావాలనే తగదా పడుతుందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. చైనాతో విభేదాల నేపథ్యంలో లోక్ సభలో రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. 90 వేల చదరపు కిలో మీటర్ల భారత భూభాగం 1962 యుద్ధం తర్వాత చైనా ఆధీనంలోకి వెళ్లిందని ఆయన పేర్కొన్నారు. దీనిపై చర్చలకు చైనా హామీ ఇచ్చిందని ఆయన వెల్లడించారు. సరిహద్దుల వద్ద ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి భారత సైన్యం సిద్ధంగా ఉందని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. అయితే రక్షణశాఖ మంత్రి చేసిన ప్రకటనతో పార్లమెంట్ లో గందరగోళం నెలకొంది. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించినట్టు తాము గతంలో చెప్పినా.. అబద్ధాలతో మభ్యపెట్టిన మోడీ ప్రభుత్వం ఇప్పడు అసలు నిజాలు భయటపెడుతుందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభ  నుంచి కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు.

Congress walks out after Rajnath Singh statement

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News