Wednesday, April 24, 2024

గుజరాత్ క్రీడాకారులపై కాంగ్రెస్ మహిళా నేత ట్వీట్

- Advertisement -
- Advertisement -

Congress woman leader tweet on Gujarat sports persons

నెటిజన్ల విమర్శతో ట్వీట్ డెలిట్.. క్షమాపణ

అహ్మదాబాద్: ఇటీవల ముగిసిన కామన్‌వెల్త్ క్రీడలలో గుజరాత్‌కు చెందిన ఎవరికైనా బంగారు పతకం లభించిందా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించి కాంగ్రెస్ నాయకురాలు నటాషా శర్మకు నెటిజన్ల నుంచి చివాట్లు లభించాయి. దీంతో తన తప్పు తెలుసుకున్న అఖిల భారత మహిళా కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకలాపాల ఇన్‌చార్జ్ అయిన నటాషా శర్మ తన ట్వీట్‌ను డెలిట్ చేసి క్షమాపణ చెప్పారు. శర్మ ట్వీట్‌పై ఘాటుగా స్పందించిన వారిలో గుజరాత్ క్రీడల శాఖ మంత్రి హర్ష్ సంఘవి ఉన్నారు. కామన్‌వెల్త్ క్రీడలలో గుజరాత్‌కు చెందిన ఎవరికైనా బంగారు పతకం లభించిందా? లేక బ్యాంకులను దోపిడీ చేయడంలోనే వారు బంగారు పతక విజేతలా అంటూ బుధవారం ఉదయం నటాషా శర్మ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. దీనికి మంత్రి సంఘవి కౌంటర్ ఇస్తూ కామన్‌వెల్త్ క్రీడలలో 61 పతకాలు సాధించి ఐదవ స్థానంలో నిలిచిన భారతీయ క్రీడాకారులను అవమానించడం మానుకోవాలంటూ హితవు చెప్పారు. ఈ క్రీడలలో గుజరాత్ క్రీడాకారులు ఐదు పతకాలు సాధించారన్న విషయం తెలుసుకోవాలంటూ కౌంటర్ ఇచ్చారు. అనంతరం&శర్మ క్షమాపణ చెబుతూ తన ట్వీట్‌ను డెలిట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News