Home తాజా వార్తలు సిడబ్ల్యుసి సమావేశం ప్రారంభం

సిడబ్ల్యుసి సమావేశం ప్రారంభం

Rahul-Gandhi

ఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఐన తరువాత తొలిసారి సిడబ్ల్యుసి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, గులాంనబీ ఆజాద్, లోక్ సభలో ప్రతిపక్షనేత మల్లిఖార్జున ఖర్గే, సీనియర్ నేతలు, అన్ని రాష్ట్రాల నుంచి పిసిసి చీఫ్‌లు, సిఎల్‌పి నేతలు పాల్గొన్నారు. ఎపి నుంచి రఘువీరా రెడ్డి, తెలంగాణ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ హాజరయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా 2019 ఎన్నికలు, కాంగ్రెస్ బలోపేతంపై చర్చ జరగనుంది.