Home తాజా వార్తలు భూగర్భ జలాలను సంరక్షించేందుకు.. జలశక్తి అభియాన్

భూగర్భ జలాలను సంరక్షించేందుకు.. జలశక్తి అభియాన్

 

 ground water

 

వనపర్తి : వేగంగా తగ్గిపోతున్న భూగర్భ జలాలను సంరక్షించుకోవడంతో పాటు భూగర్భ జలాల పెంపునకు ఉద్దేశించిన జ లశక్తి అభియాన్ కార్యక్రమం ముఖ్యమైందని కలెక్టర్ శ్వేతా మహంతి, జడ్పిచైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డిలు అన్నారు. శనివారం కె వికె ఆధ్వర్యంలో గోపాల్‌పేట మండల కేంద్రంలోని జడ్పిహెచ్‌ఎస్ పాఠశాల ఆవరణలో జలశక్తి అభియాన్ కార్యక్రమం కిం ద ఏర్పాటు చేసిన కిసాన్ మేళా కార్యక్రమానికి వారు ముఖ్య అ తిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డు తూ పంటల సాగులో రైతుల ఆలోచన మారాల్సిన అవసరం ఉ ందన్నారు. జలశక్తి అభియాన్ కార్యక్రమం భూగర్భ జలాలను పెంపొందించేందుకు ఉద్దేశించిన కార్యక్రమన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వాన నీటి సంరక్షణ, నీటి నిల్వ, భూగర్భజలాల పెంపు వంటి కార్యక్రమాలను ఉమ్మడి గోపాల్‌పేట మ ండలంలో చేపట్టడం జరిగిందన్నారు.

మండలంలో భూగర్భ జలాలు బాగా పడిపోయిన దృష్టా ఈ మండలాన్ని జలశక్తి అభియాన్ కింద ఎంపిక చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. అనంత రం జడ్పిచైర్మన్ మాట్లాడుతూ భూగర్భ జలాలు రోజురోజుకు పడిపోతున్న దృష్టా భూగర్భ జలాలను సంరక్షించు కోవా ల్సి న బాధ్యత అందరిపై ఉందన్నారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు వ చ్చే పంటలు పండించాలని కోరారు. వ్యవసాయంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని మంచి లాభా లు వచ్చే పంటలు పండించాలని కోరారు. రైతు సమన్వయ స మితి అధ్యక్షులు జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ వనపర్తి జిల్లా లో ని రైతులు, ప్రజలు నీటిని ఒడిసి పట్టుకోవాలన్నారు. వరికి ఎ క్కువ నీరు అవసరం ఉందన్నారు. వరి కాకుండా ఇతర పంట లు పండించాలని కోరారు. కూరగాయలు, వాణిజ్య పంటలను పండించడంపై జిల్లా రైతులు దృష్టి పెట్టాలని కోరారు.

కర్నూల్ జిల్లాలో రైతులు ఎక్కువగా కొర్రలు సజ్జలు, జొన్నలు, రాగులు, మిల్లెట్స్ వంటి పంటలు పండిస్తున్నారన్నారు. అనంతరం కెవికె శాస్త్రవేత్త రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ జలశక్తి అభియాన్ కార్యక్రమం కింద నీటి సంర క్షణ కార్యక్రమాలు , ఆధునిక వ్యవసాయం, నూతన వ్యవసాయ వంగడాలు, ఆధునిక వ్యవసాయ పద్ద తులు, తదితర అంశాలపై కిసాన్ మేళ ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు ,ఎంపిపి సంధ్య ,సర్పంచ్ శ్రీనివాసులు, మండల ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ ,తదిత రులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు ,జడ్పిటిసి భార్గవి, మండల రైతు సమన్వ య సమితి అధ్యక్షులు తిరుపతయ్య యాదవ్, జిల్లా అధికారులు ,డిఆర్‌డిఒ గణేష్, ఉధ్యాన శాఖ అధికారి విజయభాస్కర్ రెడ్డి, మత్సశాఖ అధికారి రాధారోహిణి, తదితరులు పాల్గొన్నారు.

Conservation of ground water