Friday, March 29, 2024

న్యాయవ్యవస్థపై కుట్రకేసు మూసివేత

- Advertisement -
- Advertisement -

Conspiracy closure on the judiciary Says Ranjan Gogoi

సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయం,  మాజీ సిజెఐ గొగోయ్‌కు క్లీన్‌చిట్, ఐబి డైరెక్టర్ లేఖ కీలక ప్రస్తావన

న్యూఢిల్లీ : న్యాయవ్యవస్థపై కుట్రకేసును మూసివేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు దేశ న్యాయవ్యవస్థను దెబ్బతీసే కుట్రపూరిత చర్యలు అంటే నమోదు చేసిన సుమోటో కేసును సుప్రీంకోర్టు గురవారం కొట్టివేసింది. కుట్రకోణంపై తనకు తాను స్పందించి అత్యున్నత న్యాయస్థానం కేసు దాఖలు చేసింది. అన్ని విషయాలు నిర్థారణ అయినందున ఇకపై మరింతగా ఆధారాలు దక్కే అవకాశాలు లేనందున కేసును క్లోజ్ చేస్తున్నట్లు న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ సారథ్యు ధర్మాసనం తెలిపింది. జస్టిస్ పట్నాయక్ కమిటీ, సిజెఐ ఎస్‌ఎ బోబ్డేల నాయకత్వపు త్రిసభ్య కమిటీ నివేదిక ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకున్నామని ధర్మాసనం తెలిపింది. రెండేళ్లు గడిచినా ఈ కేసులో ఎటువంటి ఆధారాలు దొరకకపోవడంతో, కేసును కొనసాగించాల్సిన అవసరం లేదని భావించుకుని, దీనిని క్లోజ్ చేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. మాజీ సిజెఐ రంజన్ గొగోయ్‌పై రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని ఒకరు ఫిర్యాదు చేశారు. తనను, తన భర్తను ఆయన బాధితులుగా చేశారని పేర్కొని సంచలనం సృష్టించారు.

అయితే మాజీ ప్రధాన న్యాయమూర్తిని అప్రతిష్టపాలు చేసేందుకు కుట్ర జరిగిందని, ఇందులో విస్తృత కోణాలు ఉన్నట్లు భావించి అత్యున్నత న్యాయస్థానం సుమోటో కేసు విచారణకు తీసుకుంది. ఈ కేసు విషయంలో అంతర్గత దర్యాప్తు ప్రక్రియ ముగిసిందని కేసు విషయంలో ఎటువంటి కీలక ఆధారాలు ఇక ముందు దొరికే అవకాశాలు లేవని భావించి దీనిని క్లోజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇంటలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ సమర్పించిన లేఖను కూడా ధర్మాసనం ప్రస్తావించింది. అప్పటి ప్రధాన న్యాయమూర్తి గొగోయ్ ఎన్‌ఆర్‌సి ఇతర కీలక వ్యాజ్యాలకు సంబంధించి కీలక తీర్పులు వెలువరించినందున కుట్రపూరితంగా ఆయనపై ఆరోపణలకు పాల్పడ్డారని ఈ లేఖలో తెలిపారు. కుట్ర జరిగిందని చెప్పే వాదనను తాము కూడా నిర్థారించాల్సి వస్తోందన్నారు. కుట్ర జరిగినట్లుగా తాము ప్రాధమిక స్థాయిలో తేల్చుకున్నందున ఈ కోణంలో దాఖలు అయిన కేసు కొనసాగించాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News