Friday, March 29, 2024

కామారెడ్డిలో విషాదం.. పోలీస్ స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Constable Attempt Suicide

మాచారెడ్డి: కామారెడ్డి జిల్లాలో మాచారెడ్డి మండలంలోని పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్‌కానిస్టేబుల్ లచ్చాగౌడ్(58) బుధవారం మధ్యాహ్నం పోలీస్ స్టేషన్‌లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. లచ్చాగౌడ్ మూడు సంవత్సరాలుగా మాచారెడ్డి పోలీసుస్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. కాగా బుధవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటనతో కుటుంబ సభ్యులు, పలువురు ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసుస్టేషన్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అనుమతించకపోవడంతో పోలీసు స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. లచ్చాగౌడ్ అందరితో కలుపుగొలుపుగా ఉండేవాడని, విధి నిర్వహణ పట్ల అంకితభావంతో పని చేసేవాడని పలువురు తెలిపారు.

ఈ విషయం తెలుసుకున్న కామారెడ్డి డిఎస్పీ లక్ష్మినారాయణ సంఘటన స్ధలాన్ని సందర్శించారు. చనిపోయిన లచ్చాగౌడ్ భార్య స్పృహ కొల్పోవడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి పూర్తి వివరాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. మృతుడు పని ఒత్తిడి వల్లనే చనిపోయినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

Constable Attempt Suicide at Police Station in Kamareddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News