Home రాష్ట్ర వార్తలు కానిస్టేబుల్ అభ్యర్థులకు రేపే రాత పరీక్ష

కానిస్టేబుల్ అభ్యర్థులకు రేపే రాత పరీక్ష

telangana-police

మన తెలంగాణ/ సిటీబ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుల్ అభ్య ర్థులకు ఆదివారం జరుగనున్న రాత పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్త య్యాయి. ఇందుకు సంబంధించి పరీక్ష సెంటర్లను సిద్ధం చేశామని తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ డాక్టర్ జె.పూర్ణచందర్‌రావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుంద న్నారు. పరీక్ష హాల్‌లోకి మాత్రం అభ్యర్థులు ఉడయం 9 గంటల లోపు చేరుకోవాలన్నారు. ఒక్క నిముషం ఆలస్యంగా వచ్చినా అనుమతించమన్నారు.

అభ్యర్థులు బ్లూ అండ్ బ్లాక్ పెన్‌లు వెంట తెచ్చు కోవాలన్నారు. బ్లూటూత్, సెల్‌ఫోన్లు, పర్సు, వాచ్, క్యాలుక్‌లేటర్, నోట్స్, బుక్స్, ట్యాబెట్లు, పెన్ డ్రైవ్‌లపై నిషేధం విధించామన్నారు. అభ్యర్థులకు బయోమెట్రిక్ విధానం ద్వారా పరీక్ష సెంటర్లలోకి పంపిస్తామని, తమ హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా ఐడీప్రూఫ్ వెంట తెచ్చుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద తగిన బందోబస్తు ఏర్పాటు చేశామని, ప్రతి పరీక్ష సెంటర్‌కు వంద మీటర్ల దూరంలో 144 సెక్షన్ విధించామన్నారు. పరీక్ష సెంటర్‌ను అభ్యర్థులు గూగుల్ ద్వారా సెర్చ్ చేసుకుని ముందుగానే చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు.