Home తాజా వార్తలు జయలలిత సమాధి వద్ద కానిస్టేబుల్ ఆత్మహత్య

జయలలిత సమాధి వద్ద కానిస్టేబుల్ ఆత్మహత్య

Jayalalitha-Grave

చెన్నై: జయలలిత సమాధి వద్ద విధుల్లో ఉన్న ఎఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. అరుల్ రాజ్ అనే కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీస్ ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.