Home ఖమ్మం నేలకొండపల్లిలో కానిస్టేబుల్ ఆత్మహత్య

నేలకొండపల్లిలో కానిస్టేబుల్ ఆత్మహత్య

Constable Commits Suicide In Khammamఖమ్మం : ఓ కానిస్టేబుల్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం శంకర్ గిరి తండాకు చెందిన బాషా అనే  కానిస్టేబుల్ కు భార్యతో గొడవ జరిగింది. దీంతో ఆయన భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. కాపురానికి రావాలని బాషా పలుమార్లు భార్యను కోరాడు. కానీ ఆమె మాత్రం కాపురానికి రాలేదు. దీంతో మనస్తాపానికి గురైన బాషా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాషా ఆత్మహత్యతో శంకర్ గిరి తండాలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.