Home జోగులాంబ గద్వాల్ రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

Constable Died In Road Accident At jogulamba Gadwalజోగులాంబ గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాలో శుక్రవారం ఉదయం విషాదం చోటు చేసుకుంది. ఇటిక్యాల మండల పరిధిలోని ఎర్రవల్లిలో వేగంగా వచ్చిన ట్రాక్టర్ బైక్ ను ఢీకొనడంతో బైక్ పై ప్రయాణిస్తున్న శంకర్ గౌడ్ అనే కానిస్టేబుల్ చనిపోయారు. శంకర్ గౌడ్ రాజోలి పోలీసు స్టేషన్ లో పని చేస్తున్నారు. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం శంకర్ గౌడ్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.