Home కెరీర్ ఈనెల 15నుంచి కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు

ఈనెల 15నుంచి కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు

ts-policeహైదరాబాద్: గతంలో కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు తేదీలు ఖరారు చేసింది. అభ్యర్థులకు ఈనెల 15 నుంచి ఆగస్టు 6వ తేదీవరకు ఈవెంట్స్‌లను నిర్వహించనున్నట్లు బోర్డు ఛైర్మన్ జె.పూర్ణచంద్రరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్, ఎఆర్, టిఎస్‌ఎస్‌సి, ఫైర్‌మన్, ఎస్‌పిఎఫ్ విభాగాలలో అర్హత సాధించిన 1,92,588 మందికి రాష్ట్ర వ్యాప్తంగా 13 చోట్ల కేంద్రాలు ఏర్పాటు చేశారు. కమ్యూనికేషన్ విభాగంలో అర్హత సాధించిన 27,410 మంది కోసం ఆరు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు ఈవెంట్స్ కోసం సమాచార లేఖలను రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌నుంచి పొందవచ్చు.
అభ్యర్థులు అమ హాల్‌టికెట్, రిజిస్ట్రేషన్ నంబర్లను పొందుపరిస్తే సమాచార లేఖలు ప్రత్యక్షమవుతాయి. ఈవెంట్స్‌కు వచ్చే సమయంలో అభ్యర్థులు తమ ఆధార్‌కార్డు, ఒరిజినల్ విద్యార్హతల పత్రాలు, జిరాక్స్ కాపీలను తీసుకురావలని పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం 040-23150౩62, 462 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.