Thursday, April 25, 2024

కానిస్టేబుల్ ప్రేమాయణం… కేసు నమోదు…

- Advertisement -
- Advertisement -

Constable love story in ananthapuram

అమరావతి: ఓ యువతిని కానిస్టేబుల్ ప్రేమించి మోసం చేయడంతో అతడిపై విచారణ చేపట్టిన సంఘటన అనంతరపురం జిల్లా ఉరవకొండలోని విడపనకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సమీప బంధువైన ఓ అమ్మాయికి, భద్రినాథ్ అనే కానిస్టేబుల్ మధ్య గత పది సంవత్సరాల నుంచి ప్రేమాయణం నడుస్తోంది. మంత్రాలయంలోని లాడ్జ్‌లో అమ్మాయిని శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఈ మధ్య మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో సదరు యువతి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశామని, మంత్రాలయంలో లాడ్జ్‌లో సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని సిఐ కృష్ణయ్య వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News